
బైసరన్‌లో ఉన్న గ్రీనర్ నుంచి ఆయుధాలతో చొరబడిన ఉగ్రవాదులు ఎంపిక చేసి మరీ ఊచకోతకు పాల్పడినట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు అనుబంధంగా ఉన్న ద రెసిస్టాన్స్ ఫ్రంట్ సంస్థ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి ఈ సంస్థే కారణం. టూరిస్టుల ఐడీలను చెక్ చేసి మరీ కాల్చి చంపారు. పురుషుల దుస్తులు విప్పించినట్లు కొందరు సాక్ష్యులు చెబుతున్నారు. హిందువులా కాదా అన్న నిర్ధారణకు వచ్చేందుకు అలా చేశారని అంచనా వేస్తున్నారు.
“నా తల్లిదండ్రులతోపాటు మేం ఐదుగురం పహల్గాం వెళ్లాం. కాల్పులు ప్రారంభమైనప్పుడు మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసరన్ లోయలోనే ఉన్నాం. నా తండ్రిని కాల్చిన తర్వాత వారు నా పక్కనే ఉన్న అంకుల్‌వైపు తిరిగారు. ఆయనపైనా కాల్పులు జరిపారు. నన్ను, నా తల్లిని, మా బంధువైన మహిళను వదిలేశారు. నా తండ్రి, అంకుల్ పరిస్థితి ఏమిటో తెలియలేదు” అని జగ్దలే కుమార్తె, అసావరీ వివరించారు.
ప్రధాని మోదీని సమర్థిస్తున్నందుకు తిట్టారని, కశ్మీరీ మిలిటెంట్లు, అమాయకులను చంపుతున్నారని ఆరోపించడాన్ని తప్పుబట్టారని అసావరీ తెలిపారు. మహిళలను, పిల్లలను చంపడం లేదని చెప్పారని ఆమె వివరించారు. ప్రధానిని దూషించారని తెలిపారు.
సాయం చేసేందుకు ఎవరూ అక్కడ లేరని, 20 నిమిషాల తర్వాతే పోలీసులు, భద్రతా సిబ్బంది వచ్చారని అసావరీ తెలిపారు. ఉగ్రవాదులకు భయపడి స్థానికంగా ఉన్నవారూ ఇస్లామిక్ ధర్మోక్తిని చదువుతూ ఉండిపోయారని వెల్లడించారు. తమను పర్యాటక ప్రాంతానికి పోనీల్లో మోసుకెళ్లినవారే సాయం చేశారని, వారే తిరిగి తీసుకొచ్చారని అసావరీ వివరించారు. ఆ తరువాత ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారని, పహల్గాం క్లబ్‌కు తరలించారని తెలిపారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!