
భారతదేశం తన సంస్కృతి, జ్ఞానం, నాగరికత, చరిత్ర మొదలైన వాటి గురించి గర్వపడుతుందని, కానీ భారతదేశం అంటేనే సేవా భూమి అని, సేవ, త్యాగం దాని గుర్తింపు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబెల్ తెలిపారు. ప్రార్థించే నోటి కంటే సేవ చేసే చేతులు చాలా ముఖ్యమైనవని పేర్కొంటూ ఈ సేవా పనిలో నిమగ్నమైన వైద్యులు అటువంటి ప్రశంసనీయమైన పనిని నిజం చేస్తున్నారని కొనియాడారు.
సిటీ మాంటిస్సోరి స్కూల్ గోమతినగర్ ఎక్స్‌టెన్షన్ ఆడిటోరియంలో జరిగిన శ్రీ గురు గోరఖ్‌నాథ్ స్వాస్థ్య సేవా యాత్ర 5.0 సత్కార కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ 2019 నుండి మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు సేవ చేయడం గొప్ప అదృష్టమని చెప్పారు. గురు గోరఖ్‌నాథ్ స్వాస్థ్య సేవా యాత్ర ద్వారా గొప్ప ప్రజా సేవ చేస్తున్న సభ్యులందరూ గౌరవానికి అర్హులని కొనియాడారు.
‘ఇది గౌరవ కార్యక్రమం కాదు, కృతజ్ఞతా కార్యక్రమం’ అని పేర్కొంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ధన్వంత్రి, భరతమాత, గురు గోరఖ్‌నాథ్, స్వామి వివేకానంద చిత్రపటాలకు పుష్పగుచ్ఛాలు సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభివృద్ధి ప్రధాన స్రవంతిలో వెనుకబడిన ప్రజల పట్ల మనం కృతజ్ఞత చూపించాలని ఈ సందర్భంగా దత్తాత్రేయ సూచించారు. ఈ వైద్యుల నుండి ప్రేరణ పొంది, ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా సేవ చేయడానికి ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
అణగారిన ప్రాంతాలకు వెళ్లి సేవ చేయడం గౌరవనీయమైన పని కాబట్టి, దీనిని గౌరవ కార్యక్రమం అని పిలవకూడదని,, కృతజ్ఞతా కార్యక్రమం అని పిలవాలని చెప్పారు. అణగారిన ప్రజల పట్ల కరుణ, దృఢ సంకల్పంతో దీనిని నిజం చేసేవారే ‘మానవ సేవ-మాధవ్ సేవ’ అనే మంత్రాన్ని సజీవంగా తీసుకువస్తున్నట్లని తెలిపారు. సామాజిక సంస్థలు, ప్రభుత్వం, పరిపాలన సంయుక్త ప్రయత్నాల కారణంగా, ఈ సేవ లబ్ధిదారుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో ప్రజల బాధలను తగ్గించే అటువంటి వైద్యులకు వందనం అని చెప్పారు.
నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తన పని ద్వారా వైద్యులు, వైద్య విద్యార్థులను ప్రభుత్వ సేవకులుగా చేస్తోందని కొనియాడారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతంలో నిర్మించిన డాక్టర్ హెడ్గేవార్ ఆసుపత్రి గురించి వివరిస్తూ, అక్కడ సేవలందిస్తున్న వైద్యులు బాహ్య ప్రపంచంలో వారి అర్హత ప్రకారం ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని, కానీ ఆ ఆసుపత్రిలో రోగులకు చాలా తక్కువ జీతంతో చికిత్స చేస్తున్నారని పేర్కొన్నారు.
అంతే కాకూండా, యువ వైద్యులను సేవా పనుల కోసం ప్రోత్సహించడానికి కూడా వారు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా సమయంలో, పేద కార్మికులు దూర ప్రాంతాల నుండి కాలినడకన వస్తూ ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా, వారు తమ మర్యాదపూర్వక, గౌరవప్రదమైన ప్రవర్తనను మర్చిపోలేదని గుర్తు చేశారు. అదేవిధంగా, సమాజం కూడా వారి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసిందని, వివిధ ప్రదేశాలలో వారికి ఆహారం, ఆశ్రయం కల్పించిందని వివరించారు.
ఆ సమయంలో, అనేక దేశాలలో ఆహారం కోసం అల్లర్లు జరిగినప్పటికీ, భారతదేశంకు వ్యాప్తి చెందలేదని దత్తాత్రేయ తెలిపారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్‌లో కూడా, సేవ దృక్పథంతో, నేత్ర కుంభ్ నిర్వహించడం ద్వారా వేలాది మంది ప్రజల కళ్ళను పరిశీలించామని ఆయన చెప్పారు. వారికి మందులు, అద్దాలు ఇచ్చారని చెబుతూ సమాజం పట్ల ఒకరికి ఒకరు అనే భావన మేల్కొన్నప్పుడే అలాంటి ఆలోచనలు వస్తాయని వివరించారు.
2017 కి ముందు గిరిజనులకు రేషన్ కార్డు, కనెక్టివిటీ సౌకర్యం లేదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తారు, ముసాహర్, కోల్, గోండ్ సహా అన్ని తెగలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇదివరకు కొంతమంది మిషనరీలు, వామపక్షవాదులు గిరిజన సమాజాన్ని బ్రెయిన్ వాష్ చేసేవారని, వాంటంగియాలోని 55 గ్రామాలలో ఎటువంటి హక్కులు ఉండేవి కావని పేర్కొంటూ ఈ పరిస్థితి దేశ భద్రతకు కూడా ముప్పుగా మారుతోందని హెచ్చరించారు.
భారతదేశంలో సుదీర్ఘ యాత్రలు జరుగుతున్నాయని పేర్కొంటూ ఆది శంకరాచార్య శంకర్ దిగ్విజయ యాత్ర ద్వారా భారతదేశాన్ని సాంస్కృతికంగా కూడా అనుసంధానించారని తెలిపారు. ఇటువంటి మతపరమైన యాత్రలు కేవలం విశ్వాస సాధనం మాత్రమే కాదని, సమాజాన్ని కలిపి ఉంచే మాధ్యమం కూడా. ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు, భారతదేశం పురాతన కాలం నుండి ఒక సాంస్కృతిక విభాగంగా ఉందని తెలిపారు. మతపరమైన యాత్రలపై ఎవరూ నిషేధం విధించలేరని స్పష్టం చేశారు.
భారతదేశం-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో అటువంటి ఐక్యతను తిరిగి స్థాపించే పని కూడా ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైందని ఆదిత్యనాథ్ తెలిపారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంటే ఆశ్చర్యపోతారని, 2017కి ముందు ఈ గ్రామాల ప్రజలకు ఓటు హక్కు లేదా రేషన్ కార్డు లేదని ఆయన పేర్కొన్నారు. విద్యుత్, రోడ్డు, ఆరోగ్య సౌకర్యం కూడా లేదని తెలిపారు. 2017లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, ఈ గ్రామాలకు రెవెన్యూ గ్రామాలుగా గుర్తింపు లభించిందని, క్రమంగా అన్ని పథకాలు అమలులోకి వచ్చాయని తెలిపారు.
థారు తెగ ప్రజలను బ్రిటిష్ వారు తెరాయ్ అడవుల్లో స్థిరపరిచారని, వారిని అడవిలో నివసించమని చెప్పారని, అయితే, వారికి ఎటువంటి జీతం లభించదని, వారు గుడిసెలలో నివసించారని, దోపిడీకి గురయ్యారని ఆదిత్యనాథ్ వివరించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నాయని మండిపడ్డారు. ఇప్పుడు ప్రతి గ్రామానికి రోడ్డు ఉంది, ప్రతి ఇంటికి విద్యుత్ ఉంది, ప్రతి ఒక్కరికీ ఇళ్ళు ఉన్నాయని తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రాలను తెరిచామని, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నామని చెబుతూ రేషన్, ఆయుష్మాన్ యోజన, పెన్షన్‌తో సహా ప్రతి సౌకర్యం వారికి చేరిందని ముఖ్యమంత్రి తెలిపారు. యాత్రతో సంబంధం ఉన్న అన్ని స్వచ్ఛంద సేవకులు, అధికారులు, సేవా న్యాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యమంత్రి ఈ యాత్ర ఆరోగ్య సంరక్షణ కోసం మాత్రమే కాదని, జాతి నిర్మాణం, సామాజిక సమైక్యత కోసం కూడా అని పేర్కొన్నారు. ఇది మనకు జగద్గురు ఆది శంకరాచార్యను గుర్తు చేస్తుందని, యాత్రల ద్వారా ప్రజా చైతన్యం కలిగించే పని జరిగేదని చెప్పారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!