
అమెరికాతో వాణిజ్యం కోసం భారత్ ఈ చట్టం ఆమోదాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. గతేడాది 191 బిలియన్ డాలర్ల(రూ.16.30 లక్షల కోట్లకు పైగా) నుంచి 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల(రూ.42.69 లక్షల కోట్లకు పైగా)కు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే లక్ష్యంతో భారత్, యూఎస్ మధ్య ఈ ఏడాది వాణిజ్య ఒప్పంద చర్చల కోసం సవరించిన చట్టం ఆమోదం చాలా కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఏడాది జులైలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సవరణలకు ఆమోదం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రతిపాదిత సవరణల ప్రకారం ప్రమాదం జరిగినపుడు సరఫరాదారు నుంచి పరిహారం పొందే ఆపరేటర్ హక్కు ఒప్పందం విలువకు పరిమితం చేయబడుతుంది. ఇది ఒప్పందంలో పేర్కొనవలసిన కాలానికి కూడా లోబడి ఉంటుంది. అయితే, ఒక ఆపరేటర్ సరఫరాదారుల నుంచి కోరే పరిహారం మొత్తానికి, విక్రేతను ఎంతకాలం వరకు జవాబుదారీగా ఉంచవచ్చనే దానిపై చట్టం పరిమితిని నిర్వచించలేదు.
ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పారిశ్రామిక ప్రమాదమైన భోపాల్ గ్యాస్ విపత్తు నుంచి భారతదేశ అణు బాధ్యత చట్టం, 2010 ఉద్భవించింది. భోపాల్ గ్యాస్ విపత్తు ఘటనలో యూఎస్ మల్టీనేషనల్ యూనియన్ కార్బైడ్ కార్ప్ యాజమాన్యంలోని కర్మాగారంలో 5000 మందికి పైగా మరణించారు. యూనియన్ కార్బైడ్ 1989లో కోర్టు వెలుపల 470 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించటానికి అంగీకరించింది. ప్రస్తుత అణుబాధ్యత చట్టం విదేశీ కంపెనీలను మార్కెట్ నుంచి సమర్థవంతంగా మూసివేసింది. అలాగే, 2008 అణు సహకారంపై ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి యూఎస్- భారత్ సంబంధాలను దెబ్బతీసింది.
పెరుగుతున్న ఇంధన డిమాండ్ నేపథ్యంలో భారత్ అణుశక్తిపై ప్రధానంగా దృష్టి సారించిందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రయివేటు భారతీయ కంపెనీలు అలాంటి ప్లాంట్లను నిర్మించటానికి అనుమతించాలని ప్రతిపాదించింది. రిలయన్స్ ఇండిస్టీస్, టాటాపవర్, అదానీ పవర్, వేదాంత లిమిటెడ్ వంటి భారతీయ కంపెనీలు ఈ రంగంలో దాదాపు 5.14 బిలియన్ డాలర్ల (రూ.43,888 కోట్లకు పైగా) చొప్పున పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే చర్చలు జరపటం గమనార్హం.
More Stories
భారత్, చాలాపై భారీ టారిఫ్లకు జీ7 దేశాల అంగీకారం!
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు