“నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను కాజేసేందుకు యంగ్ ఇండియా ట్రస్ట్ పేరుతో డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు వాళ్లే డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీకి వాళ్లే అధినేతలు, యంగ్ ఇండియా ట్రస్టుకు వాళ్లే డైరెక్టర్లు. పత్రిక ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకునేందుకు చేసిన కుట్ర కోణంపై 2012లో కేసు వేశారు. దీనిపై 2013లో కోర్టు నోటీసులు జారీ చేసింది” అని గుర్తు చేశారు.
సీబీఐ విచారణకు ఆదేశించిందని, అరెస్ట్ కాకుండా బెయిల్ పై ఉన్న నిందితులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు అని పేర్కొంటూ ఆ కేసుతో మోదీ ప్రభుత్వానికి ఏం సంబంధం? అని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో 5 వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు వాటాదారులుగా ఉన్నారని, ఆ ఆస్తుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు సైతం వాటా ఉందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలంతా ధర్నా చేయాల్సింది ఈడీ ఆఫీస్ ముందు కాదని, ఆ ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేసిన సోనియా గాంధీ నివాసం ఎదుట అని సూచించారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు.
ఈ కేసు విచారణను పూర్తి చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2025 ఏప్రిల్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టుకు సమర్పించిందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా పేర్కొన్నదని సంజయ్ తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులైన సోనియాగాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ నిధులను వాణిజ్య అవసరాల కోసం వాడుకుని మనీ లాండరింగ్ కు పాల్పడిందని అందులో పేర్కొందని చెప్పారు.
దాదాపు రూ. 998 కోట్ల మనీ లాండరింగ్ జరిగినట్లు పేర్కొందని, ఈ అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 25న ఈడీ చార్జ్ షీట్ పై విచారణ చేయాలా? వద్దా? అనే అంశంపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోబోతోందని తెలిపారు.

More Stories
బిజెపి మహాధర్నా పోస్టర్ విడుదల
వైఫల్యాలు దాచిపెట్టేందుకే రేవంత్ `రైసింగ్ తెలంగాణ’ సదస్సు
అక్రిడిటేషన్ల జారిలో జాప్యంపై గవర్నర్ కు ఫిర్యాదు