గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది ఇన్కంట్యాక్స్ కట్టే వారు కూడా ఉన్నారని, వారితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ఈ పథకం కింద అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారని వారిని కూడా ఎంపిక చేశారని పలువురు ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులు ఇన్కం సర్టిఫికెట్లను, తల్లిదండ్రుల ఆదాయంకు సంబంధించిన ఆధారాలను మరోసారి సమర్పించాలని బిసి సంక్షేమ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది.
ఒకవేళ ఆ విద్యార్థుల సర్టిఫికెట్లు తప్పు అని తేలితే వారి నుంచి విద్యా నిధి పథకం కింద మంజూరైన నిధులను రికవరీ చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదికను బిసి సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి సమర్పించినట్టుగా సమాచారం. అయితే ఈ విద్యార్థుల ఎంపికలో ఓ కార్యదర్శి స్థాయి అధికారి భారీగా ముడుపులు తీసుకున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని సైతం ప్రభుత్వానికి కొందరు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.

More Stories
అజారుద్దీన్కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం తడిచి రైతులు విలవిల
క్రికెట్లోనే కాదు రాజకీయాల్లోనూ ఫిక్సరే