
పంజాబ్ పోలీసుల్ని వణికించిన ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపి పాసియాను అమెరికాలో అరెస్టు చేశారు. హర్‌ప్రీత్ అరెస్టుకు చెందిన ఫోటోలను విడుదల చేశారు. అతన్ని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కస్టడీకి తీసుకెళ్లారు. అక్రమ రీతిలో అమెరికాలో ప్రవేశించిన హరిప్రీత్ బర్నర్ ఫోన్ల ద్వారా అరెస్టు నుంచి ఇన్నాళ్లూ తప్పించుకున్నాడు. భారత్ లో అతను మోస్ట్ వాంటెడ్.
అతని తలపై రూ. 5 లక్షల నజరానా కూడా ఉన్నది. పంజాబ్‌లో ఇటీవల జరిగిన హింసకు ఇతనే ప్రధాన కారకుడు. గడిచిన ఆరు నెలల్లో 14 ఉగ్రదాడులు జరడానికి కారణంగా హరిప్రీత్ అని పోలీసులు పేర్కొన్నారు. 2024 నవంబర్ నుంచి అమృత్‌సర్‌లో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్ల వెనుక ఇతన హస్తం ఉన్నట్లు తేలింది. పేలుళ్లకు తానే కారణమని అతను సోషల్ మీడియాలో ప్రచాచం చేశాడు.
పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ, బబ్బార్ కల్సా ఇంటర్నేషనల్‌తో జత కలిసి హరిప్రీత్ సింగ్ పంజాబ్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు భద్రతా దళాలు ఆరోపించాయి. తాజాగా ఓ యూట్యూబర్ ఇంటితో పాటు బీజేపీ నేత మనోరంజన్ కాలియా ఇంటిపై కూడా అతను దాడి చేయించాడు. ఈ రెండు ఘటనలు జలంధర్‌లోనే జరిగాయి.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా