
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, భారత సంతతికి చెందిన ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చేవారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 నుంచి 27 వరకు ఇటలీ, భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తున్నది. ఇరుదేశాల నాయకులతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలపై చర్చిస్తారని ఉపాధ్యక్షుడి కార్యాలయంలో ప్రకటనలో పేర్కొంది.
పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌తో సహా భారత్‌లో పర్యటించనున్నారు. వాన్స్ కుటుంబం న్యూఢిల్లీతో పాటు స్వస్థలం జైపూర్‌తో పాటు ఆగ్రాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. సెకండల్ లేడి ఉష వాన్స్ తొలిసారి భారత్‌లో పర్యటించనున్నారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మీ చిలుకూరి 1970 చివరలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఆమె అక్కడే జన్మించారు.
సుంకాల ఆందోళనల మధ్య జేడీ వాన్స్ భారత్‌లో పర్యటించబోతున్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్జ్ సైతం వచ్చే వారంలో భారత్ పర్యటించాలని భావించని వాయిదాపడింది. జేడీ వాన్స్ ఏప్రిల్ 21న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరుపనున్నారు. సుంకాల సమస్య, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య జరుగుతున్న చర్చలతో సహా భారత్-అమెరికా సంబంధాల తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇద్దరు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు.
అగ్రరాజ్య ఉపాధ్యకుడిగా జేడీ వాన్స్ విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు. ఎందరి నుంచో ప్రశంసలు కూడా సొంతం చేసుకున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ కార్యక్రమంలో ఉషను కొనియాడారు. ఇప్పుడు ఆమె అమెరికా సెకండ్ లేడీ హోదాలో తన పూర్వీకుల దేశానికి తొలిసారి రానున్నారు. ఉషా చిలుకూరి తెలుగువారే. ఆమె పూర్వీకులు ఏపీలోని కృష్ణాజిల్లా పామర్రుకి దగ్గరలోని ఓ గ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970 చివరలో అమెరికాకు వలస వెళ్లారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయో కెమిస్ట్రీరంగంలో నిపుణురాలు.
ప్రస్తుతం ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తూనే శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ పదవిలో కొనసాగుతున్నారు. తండ్రి రాధాకృష్ణ క్రిష్ చిలుకూరిగా సుపరిచితం. ఆయన ఏరోస్పేస్ ఇంజినీర్ కాగా, యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్‌గా సేవలందించారు. ఆ తర్వాత కాలిన్స్ ఏరోస్పేస్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు