
గ్రామాలకు గ్రామాలను వక్ప్ ఆస్తులుగా, వ్యక్తిగత ఆస్తులను తీసుకున్నారని, ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని తుషార్ మెహతా తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలన్న అభిప్రాయంపై ఆయన స్పందిస్తూ చట్టంపై స్టే విధించడం కఠినమైన నిర్ణయమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ తాము పరిస్థితి మారిపోవాలని కోరుకోవడం లేదని, ఐదేళ్ల వరకు ప్రొవిజెన్స్ ఉన్నాయని తమకు తెలుసుని పేర్కొన్నారు.
వాటిని తాము స్టే చేయబోవడం లేదని స్పష్టం చేశారు. మళ్లీ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ తమ వాదనలు వినాలని సీజేఐని కోరారు. మళ్లీ సీజేఐ జోక్యం చేసుకుంటూ తదుపరి విచారణ వరకు ఎలాంటి మార్పులుండొద్దని చెప్పగా, ఎస్‌జీ మెహతా స్పందిస్తూ ఏ రాష్ట్రమైనా నియామకాలు చేస్తే చట్టబద్ధంగా పరిగణించకూడదని చెప్పారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎస్‌జీ వ్యాఖ్యలు రికార్డు చేసినట్లు పేర్కొంది.
కౌన్సిల్, బోర్డులో ఎలాంటి నియామకాలు జరుగవని ఎస్‌జీ కోర్టుకు హామీ ఇచ్చారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణ వరకు ఎలాంటి నియామకాలు జరగకూడదని, యూజర్ వై వక్ఫ్‌గా పేర్కొన్న వాటితో పాటు నోటిఫికేన్ ద్వారా రిజిస్టర్ అయినవి, డీ నోటిఫై చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
కేసు విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై పిటిషన్లు దాఖలు కాగా, అన్నింటిని పరిగణలోకి తీసుకోవడం అసాధ్యమని ధర్మాసనం పేర్కొంది. ఎవరెవరు వాదనలు వినిపించాలో న్యాయవాదులు తమలో తాము నిర్ణయించుకోవాలని, తాము కేవలం ఐదు పిటిషన్లను మాత్రమే విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్