
బాలలను లైంగిక దాడులను రక్షించే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని నార్త్ జోన్ అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ డా. సి అశోక్ తెలిపారు. `అప్సా’ స్వచ్చంద సంస్థ, యూనిసెఫ్, ఆశ్రీత వంటి స్వచ్చంద సంస్థలతో కలిసి నిర్వహించిన బ్లూ అంబ్రెల్లా డే ర్యాలీలో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి ఆదేశాలతో అంతర్జాతీయ బాయ్స్ బ్లూ అంబ్రెల్లా 100 బాలలతో జరిపిన ర్యాలీని జూబ్లీ బస్సు స్టేషన్ ముందుగా ఉన్న పార్క్ నుండి ప్రారంభిస్తూ నేటి సమాజాల్లో బాలలపై 52 శాతం లైంగిక, మానసిక శారీరక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వీటిని అరికట్టాలంటే దాడులకు గురైన వారు తమకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకు వచ్చినప్పుడే వారికి నిజమైన న్యాయం అందుతుందని చెప్పారు. మౌనాన్ని వీడాలని పిలుపిచ్చారు. ఆయా స్వచ్చంద సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ బాలలు వేధింపులకు గురికాకుండా చూడాలని చెబుతూ రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి సురక్షితమైన, ఆరోగ్యమైన బాల్యాన్ని పొందే హక్కు ఉందని స్పష్టం చేశారు. అందుకనే బాలలు తమ హక్కులు, విలువలు తెలుసుకోవాలని సూచించారు.”మీరు ఒంటరివారు కాదు.. సమాజం అండగా ఉంది” అంటూ భరోసా ఇచ్చారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు, బాలలు తమ కార్యక్రమం బ్యానర్ పై సంతకాలతో మద్దతు పలికారు స్వచ్చంద సంస్థలు ఈలాటి కార్యక్రమాలు చేయడం అప్సా స్వచ్ఛంద కార్యకర్తలకు, యునిసెఫ్ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మారేడ్పల్లి సు ఇన్స్పెక్టర్ వెంకటేష్ , యూనిసెఫ్ ప్రతినిధి డేవిడ్ రాజ్, అప్సా సీనియర్ కో ఆర్డినేటర్ బస్వారాజ్, రమేష్, ఆశ్రిత కార్యదర్శి నాగరాజ్, డీసీపీఓ అధికారి శ్రీనివాస్, విజయ భాస్కర్ లతో పాటు వివిధ బస్తీల 100 మంది బాలలు పాల్గొన్నారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత