 
                పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి రోజూ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకూ వెళ్తుంది. ఈ రెండింటి మధ్య ప్రయాణం నాలుగున్నర గంట పడుతుంది. ఆ మార్గంలో ఈ రైలు చాలా కీలకమైందిగా భావిస్తారు. దీంతో ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎమ్ సేవలను తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఓ ప్రైవేటు బ్యాంక్‌కు చెందిన ఏటీఎమ్‌ను ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లో ఏర్పాటు చేసింది.
రైలు కదులుతున్నప్పుడు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండటానికి దీనికి షట్టర్ డోర్‌ను కూడా అమర్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లోని రైళ్లలోనూ ఏటీఎమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని, సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫిసర్ స్వప్నిల్ నీలా తెలిపారు.
కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినియోగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్ డోర్ అమర్చారనీ, దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.





More Stories
ఓలా, ఉబర్ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు మూసివేతతో స్తంభించిన వాణిజ్యం
శబరిమల బంగారం బళ్లారి నగల వ్యాపారికి విక్రయం