
గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన రెజ్లర్, ఎమ్మెల్యే వినేశ్ పోగట్ కు హర్యానా సర్కార్ ఆమెకు రూ. 4 కోట్ల నగదు రివార్డు ఇవాల్సి ఉంది. అయితే రూ. 4 కోట్ల నగదు రివార్డు కావాలా లేక అంత విలువైన ప్లాట్ కావాలా లేక గ్రూపు-ఏ జాబ్ కావాలా అని క్రీడా శాఖ ఇటీవల ఆమెను కోరింది.
దానికి స్పందించిన వినేశ్ పోగట్ తనకు రూ. 4 కోట్ల నగదుతో పాటు ప్లాట్ కూడా కావాలని కోరింది. దీంతో క్రీడాశాఖ ఖంగుతిన్నది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అధికారులకు అర్థం కావడం లేదు.
పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో డిస్‌క్వాలిఫై అయిన సిల్వర్ పతక విజేత వినేశ్ కేసులో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని, మూడు ఆప్షన్లలో ఆమె దేన్ని అయినా తీసుకోవచ్చు అని ఇటీవల ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ తెలిపారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం వల్ల ఆమె ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హురాలు కాదు.
ఇక నగదు రివార్డు లేదా ప్లాట్ తీసుకునే ఆప్షన్లలో ఆమె రెండింటిని కోరడం క్రీడాశాఖను ఇరకాటంలో పడేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల కేటగిరీలో వినేశ్ పోగట్ బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఫైనల్ నుంచి డిస్ క్వాలిఫై అయ్యింది. కేవలం వంద గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెను పక్కన పెట్టేశారు.
డిస్‌క్వాలిఫై అయిన కొన్ని గంటల్లో ముఖ్యమంత్రి సైనీ తన ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. వినేశ్ పోగట్ పట్ల దేశం గర్వంగా ఫీలవుతున్నదని, సిల్వర్ మెడలిస్టుకు ఇచ్చే అని బెనిఫిట్స్ ఇస్తామని ఆయన ప్రకటించారు. అయితే కొన్ని పరిణామాల వల్ల వినేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరి, జులనా అసెంబ్లీ నుంచి ఎన్నికల్లో గెలిచారు.
ఇటీవల బడ్జెట్ సెషన్‌లో సీఎం చేసిన ప్రకటన గురించి ఆమె అడిగారు. దానితో రాష్ట్ర క్రీడా విధానం ప్రకారం ఒలింపిక్ రజత పతక విజేతకు సమానమైన 30 ఏళ్ల ప్రయోజనాలను వినేశ్ ఫోగట్‌కి అందించాలని హర్యానా మంత్రివర్గం నిర్ణయించిందని ముఖ్యమంత్రి నయాబ్‌సింగ్ సైనీ ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు.
దాంతో మార్చి 25వ తేదీ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ కేసుగా తీసుకుని బెనిఫిట్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే ప్లేయర్లకు హర్యానా సర్కారు భారీగా ప్రైజ్‌మనీ ఇస్తున్న విషయం తెలిసిందే. గోల్డ్ మెడలిస్టులకు ఆరు కోట్లు, సిల్వర్ మెడలిస్టులకు నాలుగు కోట్లు, బ్రాంజ్ మెడలిస్టులకు 2.5 కోట్లు ఇస్తోంది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు