
డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందం చర్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ (జిటిఎస్)లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నామని వెల్లడించారు. గతంలో ట్రంప్ పరిపాలనతో నాలుగు సంవత్సరాలు ఈ విషయంలో చర్చలు జరిపినా ఒప్పందం కుదరలేదని, కానీ, ప్రస్తుతం పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. ఏడాదిలో అమెరికా పరిపాలనలో చాలా మార్పులు వచ్చాయని, కానీ మరో మార్పు వచ్చిందని ఇది ఒక పరిణామని పేర్కొన్నారు. ఇదీ చైనా ఎదుగుదల అని, అక్కడ బిజినెస్ కథ కూడా టెక్నాలజీ కథేనని తెలిపారు.
వాటిలో డీప్ సీక్ ఒకటి. చైనా చేసిన మార్పులు అమెరికా పరిస్థితిలో వచ్చిన మార్పులను పోలి ఉన్నాయని తెలిపారు.
ఒక వ్యక్తిని మరొకరు కొంతవరకు ప్రభావితం చేస్తారని స్పష్టమవుతోందని చెప్పారు. అమెరికా-చైనా సంబంధాలతో తమ అనుభవాలు చాలా భిన్నంగా ఉన్నాయని చెబుతూ వాస్తవానికి మనం రెండు విపరీతాలను చూశామనిస్వాతంత్య్రం వచ్చిన తొలి కొన్ని దశాబ్దాల్లో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొని మధ్యలోనే చిక్కుకుపోయామని తెలిపారు.
ఇప్పుడు ఈ పరిస్థితతి లేదని, ఇది ఒక రకంగా గోల్డిలాక్స్ సమస్య లాంటిదని జైశంకర్ చెప్పారు. ప్రస్తుతం మనం పోటీ యుగం వైపు పయనిస్తున్నామని ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. వివిధ దేశాలు ఇందు కోసం ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఈ ప్రణాళిక కూడా చాలా కష్టంగా ఉంటుందని చెబుతూ ఇప్పుడు ఏదీ పూర్తిగా వ్యాపారం కాదని, ప్రతిదీ కూడా వ్యక్తిగతమేనని వివరించారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక