
భారత్లో తన మార్కెట్ విస్తరించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది. భారీ సుంకాలు తగ్గించుకుంటే కాస్త ఊరట లభిస్తుందని చైనా ఆశిస్తోంది. మొత్తంగా చైనా వెనకడుగు వెనుక చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. భారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేశారు.
ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ ‘‘ఢిల్లీ, బీజింగ్ కలిసే పనిచేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు.
“సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’’ అని పేర్కొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సానుకూలంగా స్పందించారు.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలున్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. వాణిజ్య రంగాలలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటే ముందుకు వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేమని పేర్కొన్నారు.
మరోవంక, అమెరికా రక్షణ దళాలకు మాత్రం భారత్తో స్నేహం చాలా అవసరం. చైనాను కట్టడి చేయాలంటే తైవాన్, వియత్నాం, భారత్ ఈ మూడు దేశాలు కీలకం. అందుకే అమెరికాకు భారత్ మిత్రుడుగా ఉండటం తప్పనిసరిగా మారుతోంది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు