
సోమవారం ఆమె పరిస్థితి మరింత ఆందోళనకంగా మారింది. దీంతో క్రిటికల్ కండీషన్లో ఉన్న ఆమెను అహ్మదాబాద్లోని జైడస్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున 1.20 నిమిషాలకు ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలిపారు. అబూ రోడ్డులో ఉన్న బ్రహ్మకుమారి ప్రధాన కార్యాలయంలో శాంతివనంకు ఆమె పార్ధీవదేహాన్ని తీసుకెళ్లనున్నారు.
ప్రస్తుత పాకిస్థాన్లోని హైదరాబాద్లో సంప్రదాయ కుంటుంబంలో 1925 మార్చి 25 జన్మించారు. చిన్నతనంలో విద్యపై ఆసక్తి చూపిన రతన్, బ్రహ్మ కుమారీల గురించి తెలిసిన తర్వాత ఇటు వైపు మళ్లారు. 13 ఏళ్ల వయసులోనే బ్రహ్మకుమారీలలో చేరి ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. దేశ విభజన సమయంలో ఆమె రాజస్థాన్కు వచ్చారు.
ఆమె చివరి రోజల వరకు ఎంతో చురుకుగా ఉండేవారని బ్రహ్మకుమారీలు చెబుతున్నారు. వందేళ్ల వయసులోనూ ఉదయాన్నే 3.30 గంటలకు నిద్రలేచి పనులు చేసుకునేవారని వివరించారు. రాత్రి 10 వరకు సంస్థ కార్యకలపాలను పర్యవేక్షించేవారని తెలిపారు. హైదరాబాద్, కరాచీ నుంచి ఆమె అంతర్జాతీయ స్థాయిలో బ్రహ్మకుమారి ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1954లో జపాన్లో జరిగిన వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్లో బ్రహ్మకుమారీల తరపున ఆమె పాల్గొన్నారు. హాంగ్కాంగ్, సింగపూర్, మలేషియాతో పాటు ఆసియా దేశాల్లోనూ ఆమె పర్యటించారు.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం