శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముని ఎదుట సూర్యతిలక్ మెరిసి, భక్తులకు నేత్రానందం కలిగించింది. ప్రపంచంలో రామ భక్తులందరికీ ఆనందం కల్గించేందుకు సూర్య తిలక్ వేడుకను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అలాగే శ్రీ రామలల్లాకు రామనవమి సందర్భంగా మహామస్తకాభిషేకం నిర్వహించిన ఫోటోలను ట్రస్ట్ పోస్ట్ చేసింది.
శ్రీరామనవ మి సందర్భంగా అయోధ్య మందిరం భక్తులతో కిటకిటలాడింది. దేశవిదేశాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి బాలరాముడు దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు నిముషాల సేపు శ్రీరాముడి నుదుటి మీద సూర్యతిలక్ ధగధగలాడిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా పేర్కొన్నారు. సూర్యుడి కిరణాలు శ్రీరాముడి నుదుటను పడిన దృశ్యాన్ని చూసిన భక్తులు ఆనందంతో పులకించిపోయారు. నృత్యాలు చేశారు.
జై శ్రీ రామ్ నినాదాలతో ఆలయం మార్మోగింది. గతంలోనూ సూర్యుని కిరణాలు రామ విగ్రహాన్ని తాకేట ట్లు ఏర్పాట్లు చేసినా ఈ సారి విజయవంతంగా దర్శనం లభించిందన్నారు. ఆ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు టీవీల ద్వారా తిలకించారు. ఈ రామ నవమి సందర్భంగా, డ్రై ఫ్రూట్ లడ్డూలు, కొత్తిమీర లడ్డూలను ప్రసాదంగా అందజేసినట్లు ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఉదయం 6 గంటలనుంచే పెద్ద ఎత్తున భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఉదయం 9-30 గంటల నుంచి 10-30 గంటల వరకూ స్రీరాముడికి పాలు,పెరుగు, నేయితో పాటు సరయూ నది నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో మహా అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, ఆభరణాలతో పాటు ఘనంగా బంగారు కిరీటాన్ని ధరింపజేశారు. 56 రకాల రుచికరమైన వంటకాలతో కూడిన నైవేద్యాన్ని సమర్పించి, ఘనంగా ఆరతి సమర్పించినట్లు ట్రస్ట్ తెలిపింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్