
త్వరలో మోదీ భారత్‌ను హిందు రాష్ట్రంగా చేసే దిశగా కృషి చేస్తున్నారని రాజా సింగ్ చెప్పారు. మనమంతా ఐక్యంగా ప్రధాని మోదీకి అండగా నిలవాలని ఈ సందర్భగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ముస్లింలను మోసం చేస్తున్న వ్యక్తి ఒవైసీ అని ఆయన అభివర్ణించారు. ఒక వైపు మోదీ, మరో వైపు యోగి ఇద్దరి వైపు దేశం మొత్తం చూస్తుందని ఆయన పేర్కొన్నారు.
రామ్ మందిర్ నిర్మాణం జరగదని ఓవైసీ భావించారని రాజా సింగ్ చెప్పారు. కానీ శ్రీరామనవమి రోజు జనసంద్రాని చూసి ఒవైసీ కంగుతిన్నాడని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి భారత దేశం కాదు ఇదని, ప్రస్తుతం ఇది మోదీ భారత్ అని ఆయన అభివర్ణించారు. గతంలో రామ భక్తులు ఆలోచన, ఓర్పుతో ఉండేవారని గుర్తు చేశారు.
కానీ అప్పుడు ఆలోచించినట్లు ఇపుడు వారు లేరని రాజాసింగ్ హెచ్చరించారు. అంతేకాదు ఏదైనా ఎదుర్కోడానికి వారంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. గతంలో భారత్‌లో జిహాద్ పాతుకుపోయిందని, కానీ మోదీ వచ్చిన తర్వాత ఎవరైనా జిహాద్‌కు పాల్పడాలంటే భయపడుతున్నారని చెప్పారు. ఎందుకంటే జిహాద్‌కు పాల్పడితే ఇంట్లోకి బుల్డోజర్‌లు వస్తాయనే భయం వారిలో నెలకొందని చెప్పారు.
వక్ఫ్ బోర్డ్ బిల్ పార్లమెంట్‌లో పాస్ చేశారని గుర్తు చేస్తూ వక్ఫ్ బోర్డు పేరు మీద ఎన్నో భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని రాజాసింగ్ తెలిపారు. ఎలాంటి పాత్రలు, రిజిస్ట్రేషన్ లేకుండా వక్ఫ్ భూములంటూ బోర్డులు పెట్టిన సందర్భాలున్నాయిని గుర్తు చేశారు.
వక్ఫ్ బోర్డ్ రాక ముందు వాళ్ళకు 4 వేల ఎకరాల భూములు మాత్రమే ఉండేవని, కానీ ఆ బోర్డును అడ్డం పెట్టుకొని దాదాపు 9 లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ బిల్లు తేవడం ముస్లింకు వ్యతిరేకంగా కాదని, వారి నిజమైన భూములకు రక్షణ కల్పిస్తారని ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి