
ఇది తక్కువ ఖర్చుతో కూడిన శ్రమపై ఆధారపడిన దేశాలను అసమానంగా ప్రభావితం చేస్తుంది. ఈ ఏఐ అభివృద్ధిని ప్రపంచమంతటా సమానంగా పంచుకోదు. ఈ అభివృద్ధి కొన్ని సంస్థలకో, లేదా అభివృద్ధి చెందిన దేశాల్లోనే కేంద్రీకృతం కావచ్చు. ప్రధానంగా అమెరికా, చైనాలు ఈ విషయంలో ముందుండి అసమానతలో మిగతా దేశాలకు హెచ్చరికగా నిలువవచ్చు.
ప్రపంచ ఏఐ ఆర్ అండ్ డీ వ్యయంలో 40 శాతం కేవలం 100 సంస్థలు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇది సాంకేతిక కేంద్రీకరణను చూపుతున్నది. ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి దిగ్గజాలు ఇప్పటికే ఆఫ్రికన్ ఖండ జీడీపీకి పోటీగా మార్కెట్ మూల ధనీకరణను కలిగి ఉన్నాయి. ఏఐ ఆధారిత ఆటోమేషన్ శ్రమ కంటే మూల ధనానికి అనుకూలంగా ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల పోటీతత్వాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆదాయ అసమానతలను పెంచుతుందని ఆ నివేదిక హెచ్చరించింది.
More Stories
చంద్రుడిపై వాతావరణంపై సూర్యుడి ప్రభావం!
శబరిమలద్వారపాలక విగ్రహాలపై బంగారు-రాగి తాపడాలు
అహ్మదాబాద్ లో 2030 కామన్వెల్త్ గేమ్స్