
* ట్రంప్ తీరుపై ‘హ్యాండ్స్ ఆఫ్’ పేరిట దేశవ్యాప్తంగా నిరసనలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు అమెరికా భవిష్యత్తుపై పెను ప్రభావం చూపుతాయని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో 1.3 శాతంగా ఉన్న అమెరికా జీడీపీ మైనస్ 0.3శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఫలితంగా అగ్రరాజ్యంలో ఈ ఏడాదే ఆర్థికమాంద్యం తలెత్తే ప్రమాదం ఉందని చెప్పింది.
అమెరికా స్థూల దేశీయోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్‌కు చెందిన ఆర్థికవేత్త మైఖేల్ ఫెరోలి వెల్లడించారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలే ఇందుకు ప్రధాన కారణమని, ఆర్థిక మాంద్యంతో అమెరికాలో నిరుద్యోగ రేటు 5.3శాతానికి పెరగనుందని మైఖేల్ ఫెరోలి అంచనా వేశారు. నిరుద్యోగ సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం మార్చిలో నిరుద్యోగ రేటు 4.2శాతంగా ఉన్నట్లు మైఖేల్ ఫెరోలి తెలిపారు. మార్చిలో ఉద్యోగ నియామకాలు బలంగా ఉన్నప్పటికీ కార్పోరేట్ మార్జిన్లు, వినియోగదారుల డిమాండ్‌పై ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ఉద్యోగ నియామకాలు తగ్గే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తల అంచనా. రాబోయే రోజుల్లో నిత్యావసర ధరలు పెరగటం సహా వృద్ధిరేటు మందగిస్తుందని చెప్పారు.
ఆర్థికవ్యవస్థను గాడినపెట్టేందుకు ఫెడరల్ రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులు 20శాతం కంటే ఎక్కువగానే తగ్గనున్నట్లు మరో ఆర్థికవేత్త జోనాథన్ పింగిల్ అంచనా వేశారు. రాబోయే త్రైమాసికాల్లో అమెరికా జీడీపీలో దిగుమతుల 1986కు ముందు స్థాయిలకు తగ్గే ప్రమాదం ఉందన్నారు.
కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలపై స్వదేశంలోనే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్‌తో పాటు బిలియనీర్ మస్క్ చర్యలపై అమెరికన్లు మండిపడుతున్నారు. ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ శనివారం వేలాది మంది నిరసనకారులు నార్త్ కరోలినాలోని షాలెట్ , మస్సాచుసెట్స్‌లోని బోస్టన్, వాషింగ్టన్ డీసీ సహా పలు చోట్ల భారీ నిరసనలు చేపట్టారు.
“హ్యాండ్స్ ఆఫ్” పేరిట నిర్వహించిన ఈ నిరసనల్లో 150కి పైగా గ్రూపులు 1200మంది పాల్గొన్నారు. ఆందోళనకారుల్లో పౌర హక్కుల సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ట్రాన్స్జెండర్లు, న్యాయవాదులు, దివ్యాంగులు, నిపుణులు కూడా ఉన్నారు.
కాగా, ఈ నిరసనలపై. శ్వేతసౌధం స్పందిస్తూ సామాజిక భద్రత, మెడికేడ్లను ట్రంప్ ఎల్లప్పుడూ రక్షిస్తారని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా అమెరికాలో ఉద్యోగాల కుదింపు కొనసాగుతోంది. తాజాగా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్‌కు (ఐఆర్ఎస్) చెందిన 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది దాదాపుగా 25శాతంతో సమానం. చింది. సామాజిక భద్రత, మెడికేడ్లను ట్రంప్ ఎల్లప్పుడూ రక్షిస్తారని ఒక ప్రకటనలో తెలిపింది.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు