
గడిచిన 50 సంవత్సరాలను పరిశీలించినట్లయితే వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయని, గతంలో ఉన్న 1.20 లక్షల వరి రకాల స్థానంలో కేవలం నేడు 3000 రకాల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, సువాసన భరిత చిట్టి ముత్యాలు లాంటి వరి వంగడాలు కనుమరుగయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విత్తనాభివృద్ధి పట్ల కృషి జరగడం లేదని, విత్తన పరిశోధనకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాని కోరారు. మందిరం, కంచ గచ్చిబౌలి, వక్త్ బోర్డ్ అంశాల పట్ల ఉన్న శ్రద్ధ రైతులు, వాతావరణం, విత్తనాల అభివృద్ధి మీద పాలకులకు చిత్తశుద్ధిలేదని మోహన్ గురుస్వామి ఆవేదన వ్యక్తపరిచారు.
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థకు చెందిన గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కొన్ని కోట్ల మొక్కలను నాటరాని సీజీఆర్ సంస్థను కొనియాడారు. ప్రపంచీకరణ కారణంగా వ్యవసాయం, దేశి ఆవులు తగ్గాయని విచారం వ్యక్తం చేశారు. తూర్పు కొండల పశువుల పాల ఉత్పత్తులతో మానవుల ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. తెలంగాణ రాష్టంలో భూములలో వానపాములు తగ్గడం వల్ల భూసారం తగ్గి రైతుల ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు.
సిజిఆర్ సంస్థల విత్తనాలతో విప్లవాత్మకమైన మార్పును వ్యవసాయంలో తీసుకురావాలని సూచించారు . స్వదేశి ఆహారంతో కాన్సర్, షుగర్ వివిధ రోగాలకు నివారణ చేస్తే విధంగా సహకారం అందిస్తామని చెప్పారు. సిజిఆర్ వ్యవస్థాపకులు కె. లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ విత్తనాల పండుగలో జరగబోయే కార్యాచరణ కమిటి ద్వారా తీర్మానాల్లో మోహన్ గురు స్వామి చెప్పిన సూచనలు ప్రవేశ పెడుతామని చెప్పారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి