‘ఎల్2 ఎంపురాన్’ సినిమా నిర్మాతల్లో ఒకరైన కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ అధినేత గోకులం గోపాలన్ కార్యాలయల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)శుక్రవారం ఉదయం సోదాలు చేపట్టింది. శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిపినట్లు తెలుస్తుంది.
మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మార్చి 27న విడుదలైంది. అయితే ఈ మూవీలో 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న గోద్రా అల్లర్లు సంబంధించి సన్నివేశాలు ఉన్నాయి. ఈ మూవీలో బాల్‌రాజ్ భజరంగీ అనే వ్యక్తి ముస్లింలను కిరాతకంగా చంపడం చూపించారు.
దీంతో ఈ చిత్రం హిందూ వ్యతిరేక అజెండాను ప్రోత్సహిస్తోందని బీజేపీ సభ్యులతో పాటు హిందుత్వ సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సెన్సార్ సభ్యులు ఈ మూవీని రీ సెన్సార్ చేసి 51 కట్స్ చెప్పారు. చిత్రం హీరో మోహన్ లాల్ బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు.

More Stories
నిబంధనల ఉల్లంఘనల సాకుతో భీమా పరిహారం ఎగవేత కుదరదు!
త్వరలో భారత్కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
అమెరికా ఆంక్షలతో రష్యా చమురుకు చెల్లింపు సమస్యలు!