
* కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంకు నిధులివ్వండి
కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కాలేజీకి అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ను కోరారు. శాతవాహన వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
శాతవాహన వర్శిటీ పరిధిలో వచ్చే విద్యా సంవత్సరానికిగాను 120 మందితో (రెండు సెక్షన్లతో కలిపి) లా కాలేజీని నడిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి గతంలో విజ్ఝప్తి చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వర్చువల్ ద్వారా తనిఖీ నిర్వహించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వివరణలతో కూడిన నివేదిక కోరిందని చెప్పారు. బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు వివరణాత్మక నివేదికను పంపామని తెలిపారు.
దీనిని ద్రుష్టిలో ఉంచుకుని మూడేళ్ల లా కోర్సుకు అనుమతి ఇవ్వాలని విజ్ఝప్తి చేశారు. బండి సంజయ్ వినతికి సానుకూలంగా స్పందించిన అర్జున్ మేఘ్వాల్ అందుకు అనుగుణంగా శాతవాహన వర్శిటీకి అనుబంధంగా సాధ్యమైనంత తొందర్లో లా కాలేజీకి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే రాబోయే విద్యా సంవత్సరం(2025-26) నుండే లా కాలేజీ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.
మరోవంక, ఖేలో ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయాలని కోరుతూ బండి సంజయ్ కుమార్ కేంద్ర కార్మిక, ఉపాధి, క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కోరారు. ఈ విషయమై వినతి పత్రం అందజేస్తూ 1986లో 22.20 ఎకరాల భూమి బహుళ ప్రయోజన ఈ క్రీడా స్టేడియం కోసం కేటాయించారని చెప్పారు.
1998-2000 మధ్య ఎంపీ లాడ్స్, సింగరేణి కాలరీస్, ఎన్టీపీసీ, ఇతర ప్రైవేట్ సంస్థల సహకారంతో లెవెలింగ్, గ్యాలరీలు, 8-లేన్ 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్ వంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. అయితే రోజురోజుకూ అథ్లెట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత మట్టి ట్రాక్ కారణంగా అనేక మంది గాయాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి