ఆటిజం ఉన్న పిల్లల్లో ఉన్న ప్రత్యేక ప్రతిభలు గుర్తించి, వారిని ప్రోత్సహించాలని హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డా. ఎం. విజయ సారధి సూచించారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా “ఆటిజం పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర, ఎదుర్కొంటున్న సవాళ్లు” అనే అంశంపై మానసిక వైకల్యం గల బాలల చికిత్సా సంస్థ`మానస’లో బుధవారం జరిగిన సెమినార్ లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
శిశువులు సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించాలంటే, గర్భస్థ సమయంలో మనఃస్థితి అలవాట్ల విషయంలో తల్లులు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. రామకృష్ణ మిషన్ వారు కాబోయే తల్లుల కోసం నిర్వహిస్తున్న ఆర్యజనని కార్యక్రమాన్ని కొనియాడారు. ఆటిజం ఉన్న పిల్లలను వికలాంగులుగా కాకుండా ప్రత్యేక అవసరాలు, ప్రత్యేక ప్రతిభలు కల పిల్లలుగా చూడాలని ఆయన సూచించారు.
భూమి ఆకర్షణ శక్తిని కనుగొన్న ఐజక్ న్యూటన్, శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్, మన పురాణాల్లో అష్టావక్రుడు, నేటి తరంలో ఎలాన్ మాస్క్ వివిధ రకాల ఆటిజం లక్షణాలు ప్రేత్యేక ప్రతిభలు కలవారేనని ఆయన గుర్తుచేశారు. ఆటిజం ఉన్న పిల్లల పెరుగుదలలో డాక్టర్లు, థెరపిస్టులకంటే తల్లుల పాత్రే అత్యంత కీలకమని డా. విజయసారధి చెప్పారు.
సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో బయో కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి. పావని కిరణ్మయి మాట్లాడుతూ శిశువుల రెండు మూడు నెలల వయస్సు ఉన్నప్పుడే వారు సరిగా నవ్వని పరిస్థితులలో ఆటిజం లక్షణాలు గుర్తించే అవకాశం ఉన్నదని తెలిపారు. పిల్లల పెరుగుదలలో తేడాలు లోపాలు ఉన్నట్లయితే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని ఆమె చెప్పారు.
ప్రారంభ దశలోనే అవసరమైన చికిత్సలు అందించగలిగితే మానసిక పెరుగుదల, అభివృద్ధికి చేయూత అందించటం సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. పిల్లలు రోజులో మూడు గంటలకంటే ఎక్కువ సేపు మొబైల్ వీక్షించినట్లయితే వారిపై దుష్ప్రభావం పడే అవకాశాలు ఎక్కువని సర్వేలలో తేలిందని డా. కిరణ్మయి హెచ్చరించారు.
కుటుంబాలు చిన్నవి కావటం, భార్యా భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయటం వంటి కారణాలవల్ల పిల్లల ఎదుగుదల సమయంలో సరియైన సాంఘిక పరిస్థితులు కార్పించటంలో ఆటంకాలు, సవాళ్లు ఎదురవుతున్నావని ఆమె పేర్కొన్నారు.
సెంటర్ ఫర్ డి.ఎన్.ఎ. ఫింగర్ ప్రింటింగ్ అండ్ దియాగ్నోస్టిక్స్ లో శాస్త్రవేత్త డాక్టర్ నీరజ చిలుకోటి మాట్లాడుతూ జన్యుపరమైన రుగ్మతలు, అరుదైన వ్యాధుల మీద అధ్యయనం చేయటానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 16 కేంద్రాలను ఏర్పరచిందని తెలిపారు. అటిజం రావటానికి ఏ ప్రత్యేక జన్యువు కారణంగా గుర్తించపడలేదని, ప్రకృతి పర్యావరణ కారణాలు తోడవటంతో ఆటిజం కేసులు అధికమవుతున్నాయని ఆమె చెప్పారు.
మెడికల్ జనెటిక్స్ అందుబాటులోకి రావటంలో అవసరమైన సందర్భాలలో డాక్టర్ల సలహా మేరకు క్రామోసోమల్ ఎర్రే, జీనోమ్ సీక్వెన్సింగ్ వంటి పరీక్షలు చేయించుకొంటే రుగ్మతలకు కారణాలను కొంతవరకు తెలుసుకొనే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అ
రుదైన వ్యాధులపై అధ్యయనం చేస్తున్న మరో శాస్త్రవేత్త డాక్టర్ అంజనా కర్ అరుదైన వ్యాధులు. మానసిక రుగ్మతలపై అవగాహన పెంపొందిచటం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సెంటర్ ఫర్ డి.ఎన్.ఎ. ఫింగర్ ప్రింటింగ్ అండ్ దియాగ్నోస్టిక్స్ రూపొందించిన వీడియోలు ప్రదర్శించారు. అటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులు అడిగిన పలు ప్రశ్నలకు అతిధులు సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా దివ్యాంగజన పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. ఈ కార్యక్రమంలో మానస సైకాలజీ డిపార్మెంట్ హెడ్ శ్రీమతి జకియా మస్రూర్, మానస చిన్నారుల ఆరోగ్య వైకల్యాలు అధ్యయన సంస్ లో ఉపాధ్యాయులు, దివ్యాంగజన పిల్లల తల్లిదండ్రులు, థెరపిస్టులు తదితరులు పాల్గొన్నారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం