
తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సియూ) విశ్వవిద్యాలయం భూముల అమ్మకం ప్రతిపాదనను ఉప సంహరించుకోవాలని బిజపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్గిరి ఎంపి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్సియూ భూములు అమ్మి అప్పులు కట్టాలనే నీచమైన ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని వేలమంది నిష్ణాతులను తీర్చిదిద్దిన ప్రముఖ విశ్వవిద్యాలయంలో రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ భూముల వేలాన్ని విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో శ్మశానవాటికలకు కూడా జాగా దొరకని పరిస్థితి వచ్చిందని తెలిపారు.
పార్కులకు సైతం స్థలం లేక కాంక్రీట్ జంగల్గా మారుతుందని రాజేందర్ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో ప్రతి నిర్ణయం ప్రజాకటకం, ప్రజా వ్యతిరేకమైనదేనని తెలిపారు. విద్యార్థుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వారికి సంఘీభావం తెలుపుతున్నామని, అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈటల హెచ్చరించారు. ఇకనైనా విశ్వవిద్యాలయం భూములు అమ్మకూడదని ఆయన డిమాండ్ చేశారు.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?