
అత్యాచారం కేసులో సెల్ఫ్ స్టైల్డ్ క్రిస్టియన్ పాస్టర్ బాజిందర్ సింగ్ కు పంజాబ్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ‘యేసు యేసు ప్రాఫెట్’ గా సింగ్ పాపులర్ అయ్యాడు.
బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 2018లో పంజాబ్లోని జిరాక్పూర్ కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. విదేశాలకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి బాజిందర్ తనను శారీరకంగా వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఆయనతోపాటు మొత్తం ఏడుగురిపై ఈ కేసులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు బాజిందర్ సింగ్ను నాలుగు రోజుల క్రితం దోషిగా తేల్చింది. కేసులో అభియోగాలు మోస్తున్న మిగతా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ అతడికి శిక్ష ఖరారు చేసింది. బాజీందర్ సింగ్కు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.కాగా బాజిందర్ సింగ్ తరచూ వివాదాల్లో ఉంటుంటాడు. ఇటీవల ఆయన తన కార్యాలయంలో ఓ మహిళపైన, మరో వ్యక్తిపైన దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిని చెంపలపై కొట్టడం, చేతికి ఏది దొరికితే అది విసరడం లాంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 2022లో ఓ 22 మహిళ సింగ్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. 2022లోనే అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను బాగుచేస్తానని చెప్పి ఆమె కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. కానీ ఆమె మరణించింది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు