
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి వైరల్ అయిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా. అయితే తన వ్యాపారం బాగా జరుగుతుందనుకుంటే ఒక నెటిజన్ ఆమె ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.
దీంతో రాత్రికి రాత్రే వైరల్‌గా మారింది మోనాలిసా. తన తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో కుంభమేళాకి వెళ్లిన వారు ఆమెతో ఫొటో దిగడానికి ఆసక్తిచూపించడం, ఫొటోల పేరుతో ఆమెను ఎక్కడపడితే అక్కడ తాకడం వివాదానికి దారి తీసింది. దీంతో తన పూసల బిజినెస్ వదిలేసి తన గ్రామంకి వెళ్లిపోయింది.
మోనాలిసా పరిస్థితి తెలుసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఫొటోలు చూసి హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని ప్రకటించాడు. మణిపూర్ నేపథ్యంలో రాబోతున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీకి సంతకం కూడా చేసింది మోనాలిసా. ఈ సినిమా కోసమే ప్రస్తుతం యాక్టింగ్‌పై ట్రెయినింగ్ కూడా తీసుకుంటోంది. ఇక మోనాలిసాకి సంబంధించిన అన్ని పనులను సనోజ్ మిశ్రానే దగ్గరుండి చూసుకుంటున్నాడు.
దీంతో సనోజ్ మిశ్రా మోనాలిసాతో క్లోజ్‌గా ఉండటంపై బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సనోజ్ మిశ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనోజ్ మోనాలిసాను ప్రచారం కోసం వాడుకుంటున్నారని, ఆమెను ట్రాప్ చేస్తున్నారని, తప్పుదారి పట్టిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై సనోజ్ మిశ్రా స్పందిస్తూ మోనాలిసా నా కూతురు లాంటిదని తెలిపాడు.
“ఆమె నా కూతురు వయసు ఉంటుంది. నేను ఆమెను వేధించట్లేదు. ఆమె ఇష్టపూర్వకంగానే సినిమాలో నటిస్తుంది. మోనాలిసా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆమెను నేనే యాక్టింగ్ నేర్పిస్తున్నాను. ఇది తప్పుదోవ పట్టించడం కాదు. తనకి యాక్టింగ్ వచ్చింది అన్నప్పుడు సినిమా ప్రారంభిస్తాను” అని ప్రకటించాడు. మిశ్రా గాంధీగిరి, రామ్ కి జన్మభూమి, లఫంగే నవాబ్, కాశీ టూ కశ్మీర్ వంటి సినిమాలను తెరకెక్కించాడు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం