మయన్మార్‌లో 1,600 దాటిన మృతుల సంఖ్య

మయన్మార్‌లో 1,600 దాటిన మృతుల సంఖ్య

భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన మయన్మార్​లో మృతుల సంఖ్య 1,644కు పెరిగిందని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం గాయపడిన వారి సంఖ్య 3408కి పెరిగిందని, 139 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని పేర్కొంది.

దేశంలోని రెండవ పెద్ద నగరం మాండలే సమీపంలో భూకంపం సంభవించినప్పుడు కుప్పకూలిన పెక్కు భవనాల శిథిలాల్లో నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. ఒకప్పుడు బర్మా అయిన మయన్మార్‌లో సుదీర్ఘ కాలంగా, రక్తపాతంతో కూడిన అంతర్యుద్ధం సాగుతోంది. కాగా, భూకంప మరణాల సంఖ్య ఊహించని స్థాయిలో ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి.

రాజధాని నేపిదాలో దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనుల్లో సిబ్బంది శనివారం నిమగ్నమయ్యారు. నగరంలో అధిక భాగంలో విద్యుత్, ఫోన్, ఇంటర్నెట్ సర్వీసులు ఇంకా పునరుద్ధరణ కాలేదు. భూకంపం అనేక భవనాలను నేలమట్టం చేసింది. వాటిలో ప్రభుత్వ ఉద్యోగుల నివసిస్తున్న పలు ఇళ్లు కూడా ఉన్నాయి. అయితే, నగరంలో ఒక సెక్షన్‌ను అధికారులు శనివారం ఇతరులకు అందుబాటులో లేకుండా చేశారు. కాగా, శుక్రవారం బ్యాంకాక్‌లో పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళకు వైద్యులు ఓ పార్కులో డెలివరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

వరుస భూప్రకంపనలతో తల్లడిల్లుతున్న మయన్మార్‌కు ప్రపంచ దేశాల ఆపన్న హస్తం అందించాయి. చైనా, హాంకాంగ్‌, భారత్‌ పదుల సంఖ్యలో సహాయక సిబ్బందిని మయన్మార్‌కు పంపాయి. హాంకాంగ్‌, భారత్‌ సహాయక సామాగ్రి, ఔషధాల వంటి సామాగ్రి అందించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మయన్మార్‌కు సాయం చేస్తామని ప్రకటించారు. యూరోపియన్‌ యూనియన్‌ 27 లక్షల డాలర్లను మయన్మార్‌కు తక్షణ సహాయంగా ప్రకటించింది.

మయన్మార్​లోని పలు విమానాశ్రయాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు సహాయక సామగ్రిని, సిబ్బందిని పంపిస్తున్నప్పటికీ, ఫ్లైట్స్ లాండ్ చేయడానికి అనువుగా విమానాశ్రయాలు లేవని, అందువల్ల తీవ్ర ఆటంకం కలుగుతోందని పేర్కొంది.  పొరుగున ఉన్న థాయిలాండ్‌లో భూకంపం సుమారు కోటి 70 లక్షల జనాభా గల గ్రేటర్ బ్యాంకాక్ ప్రాంతాన్ని, దేశంలోని ఇతర ప్రాంతాలను కుదిపివేసింది.

ఇంత వరకు ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయని, 26 మంది గాయపడ్డారని, 47 మంది జాడ ఇంకా తెలియరాలేదని, వారిలో చాలా మంది రాజధానిలోని పాపులర్ చతుచాక్ మార్కెట్ సమీపంలోని ఒక నిర్మాణ ప్రదేశం నుంచి గల్లంతయ్యారని బ్యాంకాక్ నగర అధికారులు వెల్లడించారు. టన్నుల కొద్దీ శిథిలాల తరలింపు కోసం శనివారం మరిన్ని భారీ యంత్రాలను తీసుకువచ్చారు. అయితే జాడ తెలియకుండాపోయినవారిపై కుటుంబ సభ్యులు, మిత్రుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ‘వారు బతికి బయటపడాలని ప్రార్థిస్తున్నాను.