
కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (కరవు భత్యం) 2 శాతం పెంచింది. డీఏ పెంపు ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. తాజా నిర్ణయంతో జూలై ఒకటి నుంచి చెల్లించాల్సిన డియర్‌నెస్ అలవెన్స్ రేటు 53శాతం నుంచి 55 శాతానికి పెరిగింది.
జనవరి 1 నుంచి పెరిగిన డీఎ వర్తిస్తుందని తెలిపారు. డీఏ పెంపుతో కేంద్రం నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు కోటిమందికిపైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. చివరగా గత ఏడాది జులైలో డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు.
డిఏ, డీఆర్ పెంపువల్ల ఏటా ప్రభుత్వ ఖజానాపై రూ. 6614.04 కోట్లవరకు భారం పడుతోంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతుంది. ఇది జనవరి, జూలైల్లో జరగాల్సి ఉన్నప్పటికీ ఏటా మార్చి, అక్టోబరులో ప్రకటిస్తూ వస్తోంది.
ఆలస్యంగా ప్రకటించినా బకాయిలతో కలిపి జనవరి, జూలై నుంచే చెల్లిస్తారు. ముఖ్యంగా డీఏ సవరణ కోసం ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్‌ను ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఇదే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తుంది. గతేడాది అక్టోబర్‌లో దీపావళి కానుకగా డీఏ 3 శాతం పెంచిన విషయం తెలిసిందే. కేంద్రం డీఏను సరవించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది.
More Stories
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్