
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై సిఐడి కేసు నమోదు చేసింది. ఆ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మధ్యంతర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్నారనే ఆరోపణలతో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. షేక్ హసీనాతో పాటు మరో 72 మందిపై కూడా సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు.
దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ కేసుపై విచారణ ప్రారంభించాలని సిఐడిని ఆదేశించింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ అంశంపై షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగిన సంగతి విదితమే. దీంతో ఆమె దేశం విడిచిపెట్టడంతో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం బంగ్లేదేశ్‌కు ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.
అయితే డిసెంబర్ 19, 2024న మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలో ఓ ఆన్‌లైన్ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. జాయ్ బంగ్లా బ్రిగేడ్ అనే పేరుతో షేక్ హసీనాతో పాటు ఇతరులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న యూనస్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఎలా పునరుద్ధరించాలనే దానిపై చర్చలు జరిపారు.
ఈ సమాచారం సిఐడి దృష్టికి వెళ్లడంతో అధికారులు షేక్ హసీనాతో పాటు మరో 72 మందిపై కేసు నమోదు చేశారు. ఈ మీటింగ్‌లో పాల్గొన్నవారి వాయిస్ రికార్డింగ్‌లు కూడా వెలుగుచూశాయి. అందులో షేక్ హసీనా, ఇతర నాయకులు, కార్యకర్తల మధ్య చర్చలు జరిగాయి.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వంలో ప్రశాంతత లేకుండా చేయాలని ఇందులో పాల్గొన్నవాళ్లు ప్రతిజ్ఞ చేసినట్లు బంగ్లాదేశ్ స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం బంగ్లాదేశ్‌లో కలకలం రేగింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ ను విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి విదితమే.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక