ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం మరోసారి తీవ్రమైంది. సోమవారం రాత్రి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతుండగా గాజాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ దాడిలో 400 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు.
సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ కనీసం 410 మంది మృతిచెందినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది. మరో 150 మందికిపైగా గాయపడినట్లు వెల్లడించింది. జనవరి 19వ తేదీన కుదిరిన కాల్పుల విమరణ ఒప్పందం తర్వాత గాజాలో జరిగిన అతిపెద్ద వైమానిక దాడి ఇదే.
గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులకు దిగాయి. సుమారు 20 ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. గాజా సిటీ, రఫా, ఖాన్ యూనిస్ ప్రాంతాల్లోని హమాస్ కేంద్రాలను ఆ దాడి ద్వారా టార్గెట్ చేశారు. గాజాపై దాడికి ముందు ఇజ్రాయెల్ తమను సంప్రదించిందని అమెరికా తెలిపింది. తమకు చెప్పే దాడి చేసినట్లు వెల్లడించింది.
ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాను భయపెట్టాలని చూస్తున్న హమాస్ మిలిటెంట్లు, హుతీలు, ఇరాన్‌కు ఇదో హెచ్చరిక అని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్లు తె ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లిపారు.
”మా బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తోంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే దాడులకు ఆదేశించాం. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేస్తోంది” అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటినుంచి హమాస్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
తాజా పరిణామాలను హమాస్ తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడులతో ఇజ్రాయెల్ తమ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇటీవల ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా దాదాపు 30 మందికి పైగా తమ చెరలోని బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా, ప్రతిగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇంకా హమాస్ చెరలో 24 మంది బందీలు ఉన్నరని, మరో 35 మృత దేహాలు ఉన్నాయని ఇజ్రాయిల్ చెబుతున్నది. ఈక్రమంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే, అవి అమలు దిశగా అడుగులు పడలేదు.

More Stories
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం
రష్యా చమురు కంపెనీలపై ట్రంప్ ఆంక్షలతో భారత్ కు ముప్పు?