నాగపూర్ ఉద్రిక్తతలకు ‘ఛావా’ సినిమానే కారణం

నాగపూర్ ఉద్రిక్తతలకు ‘ఛావా’ సినిమానే కారణం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఛావా’ సినిమా చూసి మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్‌పై మరాఠా ప్ర‌జ‌లు కోపం పెంచుకున్నార‌ని ఫడ్నవీస్ ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఫడ్నవీస్ ముంగ‌ళ‌వారం మాట్లాడుతూ నాగ్‌పూర్‌లో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనలకు ఛావా సినిమా కారణమని పేర్కొన్నారు.

సోమవారం శంభాజీనగర్‌లో ఉన్న ఔరంగజేజు సమాధిని కూల్చివేయాలని కొందరు డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ నిరసన కాస్త హింసకు దారి తీసింది. దీంతో పోలీసులు నాగ్‌పూర్‌లోని పలు ప్రాంతాల్లో కర్య్ఫూ విధించారు. 

దీనిపై అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ  ‘ఛావా’ సినిమా ఔరంగజేబ్‌పై ప్రజల కోపాన్ని రెచ్చగొట్టిందని చెప్పారు. అయినప్పటికీ, మహారాష్ట్రలో అందరూ శాంతిని కాపాడాల‌ని ఫ‌డ్న‌వీస్ విజ్ఞప్తి చేశారు. ఇది ముందస్తు కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. హింసాకాండలో ముగ్గురు డిసిపిలు సహా 33మంది పోలీసులు గాయపడ్డారని ఆయన శాసనసభలో తెలిపారు.

‘‘నేను సినిమాను తప్పుబట్టడం లేదు.. కానీ, ఛావా సినిమా శంభాజీ మహరాజ్ చరిత్రను ప్రజల ముందుంచింది. అదే సమయంలో కొందరి మనోభావాలను రగిలించాయి. కాబట్టే వాళ్లు ఔరంగజేబు మీద వ్యతిరేకత బయటకు వచ్చింది’’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.

ఔరంగాబాద్‌ను కీర్తించడానికి ప్రయత్నిస్తే సహించబోమని విహెచ్‌పి హెచ్చరించింది. విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌ నేతృత్వంలో జరిగిన ప్రదర్శనలో ఓ మత గ్రంథాన్ని ‘ఛాదర్‌’తో సహా తగలబెట్టారంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. నాగపూర్‌ హింసపై శాసనమండలిలో మంగళవారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. 

ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నదని జిల్లా కలెక్టర్‌ దిలీప్‌ స్వామి తెలిపారు. దౌలతాబాద్‌, ఖులాదాబాద్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్‌ సిబ్బందిని మోహరించామని చెప్పారు.  శంభాజీ మహారాజ్ జీవితగాధ ఆధారంగా రూపొందిన ‘ఛావా’ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించాడు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ఘన విజయం సాధించడమే కాక.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.