బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ సెలబ్రిటీలు

బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ సెలబ్రిటీలు
 
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీనిలో భాగంగానే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.   బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తోన్న పలువురు సోషల్‌ మీడియా, టీవీ నటులపై కేసులు నమోదు అయ్యాయి. 
 
ఇమ్రాన్‌ ఖాన్‌, హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రీత, సుధీర్‌, అజయ్‌, సన్నీ యాదవ్‌, సందీప్‌, వైఎస్సార్సీపీ నేత శ్యామల, తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
 
మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని విష్ణుప్రియ, టేస్టీ తేజకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. కానీ వారిద్దరు విచారణకు రాలేదు.  విచారణకు హాజయ్యేందుకు విష్ణుప్రియ, టేస్టీ తేజ సమయం కోరారు. విష్ణుప్రియ, టేస్టీ తేజ తరఫున పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చిన శేఖర్ భాష వివరణ ఇచ్చారు.
 
విచారణకు హాజరు కావాలని అధికారికంగా నోటీసులు పంజాగుట్ట పోలీసులు ఇవ్వనున్నారు.మరికొందరు నిందితులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే తరుణంలో బెట్టింగ్‌ యాప్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్‌ కుమార్పైనా పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ యూనిఫాంలో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్‌ చేశాడు. హబీబ్‌నగర్‌ పీఎస్‌లో కిరణ్‌ కుమార్ కానిస్టేబుల్గా పని చేస్తున్నారు.
 
తాజాగా ఈ లిస్ట్‌లో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పేరు కూడా తెర మీదకు వచ్చింది.ఆమె ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో వీరు పలు పార్టీల తరుపున సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్టు సమాచారం. మంచి పనులు చేసి మార్గదర్శకంగా నిలవాల్సిన వీరు చెడు మార్గంలో ప్రయాణించడం మంచిది కాదని నెటిజన్లు మండిపడుతున్నారు.