యూపీలో పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ అరెస్ట్‌

యూపీలో పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ అరెస్ట్‌
ఉత్తర్‌ప్రదేశ్‌ లక్నోలో అనుమానిత ఐఎస్‌ఐ ఏజెంట్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. పక్కా సమాచారం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లక్నో ఎందుకు వచ్చాడు? అనే కోణంలో యూపీ ఏటీఎస్‌ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏటీఎస్‌ అధికారులు మీడియాకు వివరించనున్నారు. 
 
గత కొద్దిరోజులుగా యూపీలో ఇదే తరహా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. యూపీ ఎస్‌టీఎఫ్‌, పంజాబ్‌ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో జబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ (బికెఐ)కి చెందిన యాక్టివ్‌ ఉగ్రవాదిని మార్చి 6న యూపీలోని కౌశాంబి జిల్లాలో అరెస్టు చేశారు. 

అరెస్టయిన ఉగ్రవాది లాజర్‌ జర్మనీకి చెందిన జబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ మాడ్యూల్‌ చీఫ్‌ స్వర్ణ్‌ సింగ్‌ అలియాస్‌ జీవన్‌ ఫౌజీ కోసం పని చేస్తున్నారు. పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ యాక్టివిస్ట్‌లతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఉగ్రవాది లాజర్‌ మాసిహ్‌ను విచారించగా అనేక షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌ వస్తున్న భక్తులతో కూడిన బస్సును పేల్చేందుకు లాజర్‌ కుట్ర పన్నినట్లు వెల్లడైంది.

ఇటీవల ఫరీదాబాద్‌లోని బాన్స్‌రోడ్‌ పాలి నుంచి అబ్దుల్‌ రెహమాన్‌ (19) గురించి కీలక విషయం బయటపడింది. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ అయోధ్య రామమందిరంపై దాడి చేసేందుకు అబ్దుల్‌ను సిద్ధం చేశారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ప్రాంతీయశాఖ అయిన ఇస్లామిక్‌ స్టేట్‌-ఖొరాసన్‌ ప్రావిన్స్‌ ఈ దాడికి కుట్ర పన్నిందని అధికార వర్గాలు పేర్కొన్నారు. 

అయోధ్యలో మసీద్‌ స్థానంలో ఆలయం నిర్మిస్తున్నారని నూరిపోసి అబ్దుల్‌ రెహమాన్‌తో పాటు పలువురి బ్రెయిన్‌ వాష్‌ చేసి ఆలయంపై దాడి చేసేందుకు పన్నాగం పన్నారు. ఐసిస్‌ ఈ శాఖ పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో చురుగ్గా ఉంది.