
ప్రజా సంక్షేమం కోసం అభి వృద్ధి చేద్దామంటే… మీరు చేయరూ.. మమ్మల్ని చేయనీయరూ గిదేం పని అని బిజెపి ఎంపీ ధర్మపురి అర వింద్ ప్రశ్నించారు. పార్టీలను పక్కనపెట్టి జిల్లా మధ్యలో అందరికీ సౌకర్యంగా ఉండేలా నవోదయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకై అందరూ ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాతనే ప్రతిపాదన పంపితే రూరల్ నియోజకవర్గ కాదని బోధన్ లోని నిజాం సుగర్ భూమిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలను మార్చి బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్ రెడ్డి ప్రపోజ ల్ పంపి అడ్డుకోవడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ తో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి 7 జవహర్ నవోదయ విశ్వవిద్యాల యాలను కేటాయించారని చెప్పారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో రెండు విశ్వవిద్యా లయాలు మంజూరయ్యా యని చెప్పారు.
ఈ విశ్వ విద్యాలయ ఏర్పాటుకై రెండు జిల్లాల్లోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో కూడా చర్చించడం జరిగిందని తెలిపారు. దీంతో జగిత్యా ల జిల్లాలో అందరూ ఒకే చెప్పడంతో అక్కడ విశ్వ విద్యాలయ ఏర్పాటుకు క్లియరెన్స్ వచ్చిందని ఎం పీ చెప్పారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయ ఏర్పాటు ఆర్మూర్ నియోజకవర్గంలో చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరినట్లు తెలిపారు.
కానీ నిజామా బాద్, బోధనలో విశ్వవిద్యాలయాలు ఉన్నందున అందరికీ సౌకర్యంగా ఉండేలా జిల్లాకు మధ్యలో అందరికీ అనుకూలంగా ఉన్న రూరల్ నియోజకవ ర్గంలోని జక్రాన్ పల్లి మండలం కలిగోట్లో గల 30 ఎకరాల స్థలాల్లో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో కూడా చర్చించామని చెప్పారు.
అందరితో చర్చించిన అనంతరమే కలిగొట్లో విశ్వవిద్యాలయ ఏర్పాటుకు స్థానిక తహసిల్దార్ నుంచి జిల్లా కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ వరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే, కలిగోట్లో కాదని బోధన్ లో ఇప్పటికే విశ్వవిద్యాలయం ఉన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో ఏర్పాటు చేయాలని పంపి అడ్డుకోవడాన్ని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణకు కేటాయించిన 7 విశ్వ విద్యాలయాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా క్లియరెన్స్ కూడా పూర్త యింది. కానీ నిజామాబాద్ లో విశ్వవిద్యాలయ ఏర్పాటూలో కాంగ్రెస్ నాయకుల దిగజారుడు రాజకీయాలతో తిరస్కరణకు గురయింది మండిపడ్డారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత