
మహిళలకు సానుభూతి కాదని, సమాజంలో సాధికారత అవసరమని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా జడ్జీలలో ఒకరైన జస్టిస్ ఎం.త్రివేది మౌఖికంగా వ్యాఖ్యానించారు. బాధితురాలి పట్ల అందరి సానుభూతి ఉందని లైంగిక వేధింపుల కేసు విచారణ సందర్భంగా నిందితుడి తరపున వాదిస్తున్న న్యాయవాది సమర్థిస్తుండగా, జడ్జి ఖండించారు.
‘మహిళలకు సానుభూతి అవసరంలేదు. చట్టాలను సమర్థవంతంగా, కఠినంగా అమలు చేయడం ద్వారా వారికి సాధికారత కల్పించాలి’ అని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సీనియర్ న్యాయవాది స్పందిస్తూ ఇళ్లలో మహిళలకు అధికారం ఇవ్వాలి. అది జరుగుతోందని చెప్పగా ఈ వ్యాఖ్యలను జడ్జి మరోసారి ఖండించారు.
కేవలం ఇళ్లలో ఉన్న మహిళల గురించి మాత్రమే కాదని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి చోటా ఉన్న మహిళలందరికీ సాధికారత అవసరమని జడ్జి స్పష్టం చేశారు. జడ్జి వ్యాఖ్యలతో న్యాయవాది ఏకీభవిస్తూ ‘అవును .. ప్రతి చోటా’ అని జోడించారు. నిందితుడు ఏడు నెలలుగా జైలులో ఉన్నాడని న్యాయవాది వాదించారు.
తమిళనాడుకి చెందిన ఈ కేసు అత్యాచారానికి సంబంధించినది. బాధితురాలి మెడపై చిన్న గాయం మాత్రమే ఉందని, హత్యాయత్నం కేసు కాదు. దీంతో శిక్షను పున:పరిశీలించాల్సి వుందని న్యాయవాది వాదించారు. బాధితురాలి మెడపై ఉన్న గుర్తు సాధారణ గాయం కాదని, నైలాన్ తాడుతో గొంతు కోసి హత్య చేసేందుకు యత్నించారని జడ్జి పేర్కొన్నారు. రెండు కోర్టులు ఈ తీర్పును ధృవీకరించాయి. శిక్ష పరిమితిపై సుప్రీంకోర్టు రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్