ఐపీఎల్ సీజన్ 2025కు ముందుగా బీసీసీఐ ఆటగాళ్ల కోసం కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆటగాళ్లు కేవలం జట్టు బస్సులోనే ప్రయాణించాలనే నిబంధనతో పాటు, డ్రెస్సింగ్ రూమ్‌లో కుటుంబ సభ్యుల ప్రవేశాన్ని నిషేధించింది. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ వేడుకల్లో ఫార్మల్ డ్రెస్సింగ్ తప్పనిసరి చేయడంతోపాటు, ఎల్ ఈ డి బోర్డులపై బంతిని కొట్టకుండా బ్యాటర్లకు హెచ్చరికలు జారీ చేసింది.
ఈ మార్గదర్శకాలు ఆటలో మరింత క్రమశిక్షణ తీసుకురావడమే కాకుండా, ఆటగాళ్ల ప్రవర్తనకు స్పష్టమైన నియమాలను అందిస్తాయని బీసీసీఐ పేర్కొంది. 2025 ఐపిల్ సీజన్‌కు ముందుగా ఆటగాళ్ల కోసం కఠినమైన ఎస్ పి ఓ లను అమలు చేసింది. భారత జట్టుపై ఇటీవల అమలు చేసిన కొన్ని నియమాలను 10 ఐపిల్ ఫ్రాంచైజీలకు విస్తరించి, ఆటగాళ్లు కేవలం జట్టు బస్సులోనే ప్రయాణించాలనే నిబంధనను తీసుకొచ్చింది.
ఈ కొత్త మార్గదర్శకాలను ప్రధానంగా ఆట క్రమశిక్షణ పెంచడంలో భాగంగా తీసుకున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ ప్రాక్టీస్ రోజుల్లో కూడా ఆటగాళ్ల కుటుంభం సభ్యులు, స్నేహితులు డ్రెస్సింగ్ రూమ్‌లోకి ప్రవేశించడానికి అనుమతించరని బీసీసీఐ తెలిపింది. మ్యాచ్ ప్రాక్టీస్ సమయంలో మాత్రమే గుర్తింపు పొందిన సిబ్బందిని డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతిస్తారు.
ఆటగాళ్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు వేరే వాహనాల్లో ప్రయాణించాల్సి ఉంటుందని, ఆట మైదానం వెలుపల ఉన్న అతిథి ప్రాంతం నుంచి మ్యాచ్‌ను వీక్షించవచ్చని పేర్కొంది. ఇంతకు ముందు కొందరు ఆటగాళ్లు వ్యక్తిగత వాహనాల్లో ప్రాక్టీస్ సెషన్లకు హాజరయ్యేవారు. అయితే ఇప్పుడు బీసీసీఐ కొత్త మార్గదర్శకాలను అమలు చేసి, ప్రతి ఆటగాడు ప్రాక్టీస్ కోసం జట్టు బస్సును ఉపయోగించాల్సిందేనని స్పష్టం చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌ల అనంతరం జరగే ప్రెజెంటేషన్ వేడుకల్లో ఆటగాళ్లు స్లీవ్‌లెస్ జెర్సీలు ధరించకూడదు.
ఫార్మల్ డ్రెస్సింగ్‌ను పాటించకుంటే మొదటిసారి హెచ్చరిక ఇచ్చి, రెండవసారి నుంచి ఆర్థిక జరిమానా విధించనున్నారు. అలాగే, ఆటగాళ్లు అక్రిడిటేషన్ కార్డును మరిచిపోయినా జరిమానా విధించనున్నారు. బీసీసీఐ ప్రకటన ప్రకారం, బ్యాటర్లు బౌండరీ రోప్స్ వెలుపల ఉన్న ఎల్ ఈ డీ బోర్డులపై బంతిని కొట్టకూడదని హెచ్చరించింది. స్పాన్సర్ షిప్ బృందాలు ఈ బోర్డుల రక్షణ కోసం ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని సూచించింది.

More Stories
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు
సంతాప తీర్మానంలో విమర్శలపై బిజెపి అభ్యంతరం
అయోధ్య దర్శన సమయాల్లో మార్పులు!