
కన్నడ నటి రాన్యా రావును బెంగళూరు విమానాశ్రయంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకొన్నారు. ఆమె నుంచి 14.8 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.12.56 కోట్లు ఉంటుందని అంచనా. ఆమెను మంగళవారం జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల జుడిషియల్ కస్టడీ ఆమెకు విధించారు.
గత 2 నెలల్లోనే దాదాపు 10 సార్లు, గత 15 రోజుల్లోనే నాలుగుసార్లు ఆమె దుబాయ్‌కి వెళ్లి రావడం అనుమానాలకు తావిచ్చింది. ఇక దుబాయ్‌కి వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన బట్టలు వేసుకున్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమె రాకపోకలపై నిఘా పెట్టి చివరికి ఇటీవల రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అయితే గత ఏడాది కాలంగా ఆమె 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు తేల్చారు. మె ఎయిర్‌పోర్టులో దిగినప్పుడల్లా తాను డీజీపీ కూతురునని ప్రచారం చేసుకొనేదని తేలింది. ఇందులో అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తు చేపట్టిన అధికారులకు రన్యా రావు సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్‌మెయిల్ చేశారని తెలిపింది. అయితే ఎయిర్‌పోర్టులో రన్యా రావుకు సాయం చేసిన కానిస్టేబుల్ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేశారు. త్వరలోనే ఆమె భర్తను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే, నగరంలోని లావెల్లే రోడ్డులోని ఆమె నివాసంలోనూ అధికారులు తాజాగా సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో మరో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు గుర్తించారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఆమె వద్ద నుంచి రూ.17.29 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇటీవలే కాలంలో బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన అతిపెద్ద బంగారం అక్రమ రవాణా కేసుల్లో ఇది ఒకటి అని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. కాగా, 35 ఏళ్ల రన్యారావు కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘మాణిక్య’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘వాఘా’, ‘పటాకీ’ సినిమాల్లో నటించారు. అయితే, రాన్యా ఇటీవతే తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండడంతో ఆమెపై అధికారులు నిఘా పెట్టారు.
ఎలాంటి అనుమానం రాకుండా ఆమె బంగారం బిస్కెట్లను దుస్తుల్లో దాచి, తీసుకొస్తున్నట్లు గుర్తించారు. ఆమెపై నిఘా పెట్టిన డీఆర్‌ఐ అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందులో అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె కర్నాటక పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ డీజీపీ రామచంద్ర రావు కుమార్తె కాగా, ఆమె చేసే పనులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. 4 నెలల క్రితమే ఆమెకు పెళ్లి అయిందని, అప్పటి నుంచి తమ ఇంటికి రాలేదని తెలిపారు. ఆమె, తన భర్తతో పాటు ఎలాంటి వ్యాపారాలు చేస్తోంది అనే విషయం తమకు తెలియదని వెల్లడించారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం