తోడల్లుళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై వచ్చారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, ఎంపీలు డి పురందేశ్వరి, శ్రీ భరత్ కూడా పాల్గొన్నారు. ఈ గ్రంధాన్ని ఆంగ్లంలో, తెలుగులో కూడా రచించారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారని, అయితే ఆయన పుస్తకం రాస్తారని ఎప్పుడూ అనుకోలేదని, ఆయనలో ఇంత డెప్త్ (Depth) ఉందని తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తమ కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి అని పేర్కొంటూ ఇద్దరం కలిసి ఎన్టీఆర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నామని, ఆయన అప్పజెప్పిన బాధ్యతలు నెరవేర్చేవాళ్లమి, కలిసి 40 ఏళ్లు ఉన్నామని.తెలిపారు.
ప్రపంచ చరిత్ర పుస్తకం రాయడం అంత సులభమైనది కాదని వెంకయ్య నాయుడు తెలిపారు. కానీ ఇంత సరళంగా, సులభతరంగా రాయడం గొప్ప విషయం అని కొనియాడారు. చరిత్ర ద్వారానే మానవాళి తీరు తెలుసుకో గలుగుతామని చెప్పారు.
“బ్రిటిష్ వారు భారత చరిత్రను వక్రీకరించి రాశారు. వాస్తవం ప్రస్ఫూటించేలా రాయాలని సలహా ఇచ్చాను. మన వద్ద అంకెలు వ్యవస్థ ఉండేది. అది అరబ్బులు నేర్చుకున్నారు. దేశ విభజన కారణంగా మనం చాలా చరిత్రను కోల్పోయాం. తక్షశిలలాంటివి మనం కోల్పోయాం. మరుగునపడ్డ అనేక అంశాలు వెలుగులోకి తీసుకుని రావాల్సి ఉంది. మన చరిత్ర మన ఆనవాలు మన సంస్కృతిని వెలికి తీసి పుస్తకం రూపంలో రాయాలి. చరిత్ర జరిగినది జరిగినట్టు వాస్తవం రాయాలి” అని సూచించారు.

విలువలతో కూడిన రచనలు భవితరాలకు అవసరమని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఉత్సాహం కల్పించే ఇలాంటి ఒక పుస్తకం రాయడం, అందులో చరిత్ర రాయడం అంత సులభం కాదని తెలిపారు. అరిస్టాటిల్ అన్నట్టు చరిత్ర రాసినవారు గెలిచిన వారు అయితే ఆ రాత విధానం వేరుగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు చరిత్ర మొత్తం కేవలం 350 పేజీల్లో రాయడం గమనార్హమని చెబుతూ అదే ఆయన నైపుణ్యానికి కొలమానమని కొనియాడారు.
చంద్రబాబుకు తనకూ వైరం ఉందని అంటుంటారని, అయితే వైరం ఉన్నమాట నిజమే అని దగ్గుబాటి స్పష్టం చేశారు. ‘కాలంతో పాటు మనం మారాలి. నాకు మళ్లీ రాజకీయ కోరికలు లేవు. మళ్లీ అలాంటి కోరికలు ఉన్నాయని అనుకుంటారేమో. ఇది వరకు చంద్రబాబు గురుంచి పుస్తకం రాసుండొచ్చు. అదంతా గతం , అదంతా వదిలేస్తాం. నాకు ఎలాంటి భేషజాలు లేవు’ అని తెలిపారు.
More Stories
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్