
తమిళనాడుకు చెందిన కల్పన తెలుగు, తమిళం సహా పలు భాషల్లో గాయనిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని నిజాంపేట వర్టెక్స్ ఫ్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలో నివాసముంటున్నారు. గతంలో కల్పనకు వివాహమైనా 2010లో భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఆమెకు 18 ఏళ్ల కుమార్తె ఉంది.
2018లో కేరళకు చెందిన వ్యాపారి ప్రసాద్ ప్రభాకర్‌ను పెళ్లిచేసుకుని ఐదేళ్లుగా నిజాంపేటలోని విల్లాలో ఉంటున్నారు. భర్త తరచూ కేరళకు వెళ్లి వస్తుంటారు. ఎప్పుడూ మానసిక ఒత్తిడికి గురయ్యే కల్పన, ప్రశాంతత కోసం తరచూ మాత్రలు తీసుకుంటారు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం ఆమె భర్త చెన్నై వెళ్లారు. ఇంట్లో కల్పన ఒక్కరే ఉన్నారు.
మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు తన భర్తకు ఫోన్ చేసి నేను ఆపస్మారక స్థితిలోకి వెళ్తున్నాను’ అని చెప్పారు. భర్త తిరిగి కాల్ చేయగా స్పందన లేదని తెలుస్తోంది. భర్తను పోలీసులు ఆరా తీయగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. కుమార్తెతో గొడవలు కారణంగా ఒత్తిడికి గురవుతుంటారని పోలీసులు గుర్తించారు.
కల్పన బహుభాషా నేపథ్య గాయని. కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ గాయకుల్లో కల్పన ఒకరు. 27 ఏళ్లుగా పాటలు పాడుతున్నారు. దేశవిదేశాల్లో 3వేలకు పైగా సంగీత ప్రదర్శనల్లో పాల్గొన్నారు .తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో అనేక పాటలు పాడారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి