తాను ఆత్మహత్యకు ప్రయత్నించ లేదని, రోజు వారివాడే మందులలొ హైడోస్ గా తీసుకోవడంతోనే తాను అపస్మారక స్థితికి వెళ్లినట్లు తెలిపారు గాయని కల్పన. మంగళవారం అపస్మారక స్థితిలో ఉన్న గాయనిని చికిత్స కోసం పోలీసులు కార్పొరేట్ హాస్పటల్లో చేర్చారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ కోటుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆమె నుంచి పోలీసులు వాగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనను ఆమె వివరించారు. తాను ఇన్సోమ్నియాతో బాధపడుతున్నానని, దానికోసం కొంతకాలంగా టాబ్లెట్స్ వాడుతున్నానని తెలిపారు. ఈ టాబ్లెట్స్ ఓవర్డోస్ కావడంతో అపస్మారకంలోకి చేరుకున్నానని చెప్పారు.
ఈ సమయంలోనే తన భర్త పలుసార్లు ఫోన్ చేశారని, తాను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అపార్ట్మెంట్ కార్యదర్శికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని ఆమె చెప్పారు. తమ కుటుంబంలో ఎటువంటి వివాదాలు లేవని కల్పన స్పష్టం చేశారు. కాగా, ఆమె అపస్మారక స్థితిలో మంగళవారం రాత్రి కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి గాయనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులు కల్పన హెల్త్ బులెటిన్‌ను తాజాగా విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
“గాయని కల్పన నిద్రమాత్రలు మింగారు. ఆమెను అపస్మారక స్థితిలో మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి అస్థిరంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాం. ప్రస్తుతం వెంటిలేటర్ తీసేశాం. లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. అందుకే ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నాం. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. పరిస్థితిని బట్టి రెండు లేదా మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం” అని డాక్టర్ చైతన్య తెలిపారు.
ఇదే విషయం తెలిసిన కేరళలో ఉంటున్న ఆమె కుమార్తె హైదరాబాద్ కు చేరుకున్నారు. తల్లి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడుతూ ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఈ సంఘటనపై ఆమె మాట్లాడుతూ, ఒత్తిడి కారణంగానే ఒకింత ఎక్కువ మోతాదులో తన తల్లి మాత్రలు తీసుకున్నదని తెలిపారు.
తన కూతురు తన మాట వినలేదనే కారణంగా మనస్తాపానికి గురైన కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలను ఆమె కొట్టిపారేశారు. తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని, వారు చాలా బాగా ఉంటున్నారని చెఆమె ప్పారు. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని ఆమె స్పష్టం చేశారు. దయచేసి తప్పుడు కథనాలు సృష్టించవద్దని ఆమె మీడియాను కోరారు. తన తల్లి కల్పన హైదరాబాద్‌లో లా పీజీ చేస్తోందని వివరించింది. కల్పన మానసిక ఒత్తిడికి గురవుతూ, నిద్రలేమి సమస్యతో బాధపడేదని ఆమె పేర్కొంది.

More Stories
నైతిక, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేథస్సు కోసం భారత్
హోమ్ శాఖ కోసం పట్టుబడుతున్న అజారుద్దీన్!
చేవెళ్ల బస్సు ప్రమాదంలో 21 మంది బలి