అయోధ్య రామాలయంపై దాడికి ఉగ్ర కుట్ర భగ్నం!

అయోధ్య రామాలయంపై దాడికి ఉగ్ర కుట్ర భగ్నం!
అయోధ్యలోని రామాలయంతోపాటు పలు మతపరమైన సంస్థలపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఈ కుట్రను గుజరాత్‌ పోలీసులు భగ్నం చేశారు. గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ (ఏటీఎస్) పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్‌లోగల పాలి ఏరియాలో  ఉగ్రవాది, 19 ఏళ్ల వ‌య‌సున్న అబ్దుల్ రహమాన్ ని అరెస్ట్ చేసి గుజరాత్కు తరలించారు. 
 
నిందితుడు యూపీకి చెందినవారిగా గుర్తించారు. అతని నుంచి రెండు గ్రెనేడ్‌లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ఏజెన్సీలు, ఫరీదాబాద్ ఎస్‌టీఎఫ్‌తో కలిసి సంయుక్తంగా గుజారాత్ ఏటీఎస్ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. టెర్రరిస్టుల టార్గెట్‌లలో అయోధ్య రామమందిరంపై దాడి చేయడం కూడా ఒకటిగా ఉన్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి.
అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్‌లను నిర్వీర్వం చేశారు. రెహ్మా్న్‌‌కు టెర్రరిస్టు సంస్థలతో ఉన్న సంబంధం, అతని టార్గెట్‌కు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు అతడిని గుజరాత్‌కు తరలిస్తు్న్నారు. రెహ్మాన్ అరెస్టుతో భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నమైనట్టు పోలీసులు చెబుతున్నారు. 

కాగా ఉగ్రవాదుల జాడ కోసం గుజరాత్ ఏటీఎస్ చేపట్టిన సెర్చింగ్‌ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. అబ్దుల్ రెహ్మాన్‌ అరెస్ట్ ద్వారా అయోధ్య రామాలయంపై దాడికి కుట్ర పన్నినట్లు బయటపడటంతో అయోధ్యలో హై అలర్ట్‌ ప్రకటించారు. ముఖ్యంగా రామాలయం దగ్గర భద్రతను పటిష్టం చేశారు.