
మహారాష్ట్ర సీఎం కార్యాలయం పేల్చాస్తామంటూ సదరు వ్యక్తి బెదిరించినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో వోర్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి తనను తాను మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్‌గా పేర్కొన్నారు. బెదిరింపు మెసేజ్‌తో వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు సీఎం భద్రతను కట్టుదిట్టం చేశారు.
అంతేకాదు, ఈ బెదిరింపు మెసేజ్‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కాగా, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు సైతం గత ఫిబ్రవరి 21న బెదిరింపులు వచ్చాయి. ఇలాంటి బెదిరింపులు తనకు కొత్తేమీ కాదని షిండే అప్పట్లో వ్యాఖ్యానించారు. డాన్స్ బార్ మూసేసినప్పుడు తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని, కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయని, అయితే తాను భయపడలేదని చెప్పారు.
గడ్చిరోలిలో తొలి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించినప్పుడు కూడా నక్సలైట్ల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. షిండే కారును బాంబుతో పేల్చేస్తామంటూ ఇటీవల బెదిరింపులు రావడంతో బుల్దానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
కీలక నేత బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి!