రాష్ట్రపతి నిలయంలో సైన్స్ డే సంబరాలు

రాష్ట్రపతి నిలయంలో సైన్స్ డే సంబరాలు

సికింద్రాబాద్ ప్రాంతం బొల్లారంలో భారత రాష్ట్రపతి శీతాకాలపు విడిదిని రాష్ట్రపతి నిలయంను ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిపాదనగా పర్యాటకులకు సందర్శించే వీలు 2023 మార్చి నుంచి కల్పించారు. ఇంతవరకు నాలుగున్నర లక్షల మంది ఈ అపురూపమైన ప్రాంగణాన్ని చూసి వెళ్లారని అంచనా.  సంవత్సరం పొడుగునా విభిన్న కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. 

అందులో భాగంగా ఫిబ్రవరి 27,28 రెండు రోజులపాటు జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున బాల బాలికలకు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ పాఠశాలల బాల బాలికలు పెయింటింగ్ మొదలైన పోటీలు తోపాటు సైన్స్ ఎగ్జిబిషన్ తిలకించే ఏర్పాటు కూడా చేశారు.  ఈ రెండు రోజుల సైన్స్ పండుగ ప్రారంభోత్సవం గురువారం ఉదయం జరిగింది.  

గురువారం రోజున 116 పాఠశాలలకు సంబంధించిన 2700 మంది బాల బాలికలు పాల్గొన్నారు. శుక్రవారం కూడా ఈ సంఖ్యకు తగ్గకుండా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఇందులో శాస్త్రవేత్తలు డాక్టర్ సి మోహన్ రావు, బి శశికిరణ్, ఏ రామచంద్రయ్య, జి సురేందర్ రెడ్డి, పత్తిపాక మోహన్ ఎం వేద కుమార్,  దేవేందర్ గార్లతో పాటు ప్రముఖ సైన్స్ రచయిత, ఆకాశవాణి విశ్రాంత డైరెక్టర్ డా. నాగసూరి వేణుగోపాల్ కూడా అతిథిగా పాల్గొన్నారు. 

నేషనల్ బుక్ ట్రస్ట్, జనవిజ్ఞాన వేదిక ఎంతో తోడ్పాటును అందించి కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదపడ్డారని రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ ఆఫీసర్ శ్రీమతి రజినీప్రియ ధన్యవాదాలు తెలిపారు. కోయ వెంకటేశ్వరరావు, ‘చెకుముకి’రాజా, రాజమండ్రి సైన్స్ మిత్రులు ఎం మల్లికార్జునరావు, రచయిత్రి, అనువాదకులు శాంతి ఇషాన్ మొదలైనవారు పాల్గొన్నారు.