
తెలంగాణాలో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్య కోర్సుల్లో ప్రవేశాలలో వంద శాతం సీట్లు ఇక తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత ఏడాది వరకు 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక నుంచి తెలంగాణ విద్యార్థులు మాత్రమే రాష్ట్రంలోని వృత్తి కోర్సుల్లో ప్రవేశాలు పొందనున్నారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫార్మా డి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, న్యాయ విద్య, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు, 15 శాతం సీట్లను అన్ రిజర్వ్‌డ్ కోటా కింద కేటాయించారు.
కాగా, 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కోటా సీట్ల కేటాంయిపుల్లో పలు మార్పులు చేసింది. ఈ సీట్లకు నాలుగు రకాల వారు అర్హులుగా గుర్తిస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ కోటాలో తెలంగాణ స్థానికులతో పాటు 10 సంవత్సరాలు తెలంగాణలో నివాసం ఉన్న వారు, ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న తెలంగాణ వారు కూడా అర్హులే.
అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు, వారి జీవిత భాగ స్వాములకు సీట్లు కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచి ఇంజినీరింగ్, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి లోకల్, నాన్ లోకల్‌ను నిర్ధారించేందుకు విధివిధానాల రూపకల్పనపై అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ నియమించింది.
ఈ కమిటీ సిఫార్సులను పరిశీలించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్ల పాటు తెంలగాణ చదివి ఉండాలి. లేదా ఏడేళ్ల చదువులో నాలుగేళ్లు తెలంగాణలో చదివిన పక్షంలో స్థానిక కోటా కింద సీట్లు పొందుతారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు