
తెలంగాణ ప్రాజెక్టులను తనకు కేంద్రంలో అడ్డుకొంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. హైదరాబాద్ నగరంలోని మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని రేవంత్ పేర్కొనడం అవగాహనా రాహిత్యమని కొట్టిపారవేసారు.
ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుందని, దానికి అనుగుణంగానే వ్యవహరిస్తారని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ కేంద్రం ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో చెప్పారా? అని ఆయన నిలదీశారు.
“ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టం. కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది. దానికి అనుగుణంగానే వ్యవహరిస్తారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో చెప్పారా?నేను ఏదైనా ప్రాజెక్టును అనుకున్నట్లయితే రేవంత్ రెడ్డి నిరూపించాలి.” అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ వద్దకు వెళ్లకుండాకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డే అడ్డుకున్నారని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన వెంటనే రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన మిత్రుడు కేసీఆర్ పది సంవత్సరాల్లో చేయని పని ఇప్పుడు చేస్తే రేవంత్‌రెడ్డికి పేరొస్తుందనే అలా చేశారని ధ్వజమెత్తారు. తనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పేరు ముఖ్యం కాదని, కావాలంటే అనుమతులు, నిధులు తెప్పించి ఆ పేరును కిషన్‌రెడ్డినే తెచ్చుకోమనండని ముఖ్యమంత్రి సూచించారు. తాను కూడా ఆయన పేరే ఊరూరా ప్రచారం చేస్తానని, సన్మానం చేసి గండపెండేరం తొడుగుతానని వెల్లడించారు.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?