
‘ఓపెన్ ఎఐ ప్రపంచానికి చాట్‌జీపీటీని పరిచయం చేసి, ఎఐ సేవల్లో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. కృత్రిమ మేధను మరింత అభివృద్ధి చేసే దిశగా, తాజాగా ‘ఎఐ ఏజెంట్’ అనే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వర్చువల్ సాయంగా మారే ఈ ఎఐ ఏజెంట్లు, వినియోగదారుల ప్రాంప్ట్‌ల ఆధారంగా ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌గా పనులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ప్రస్తుతం ఎఐ సేవలు అమెరికాలో చాట్‌జీపీటీ ప్రో యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, తాజాగా భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యూకే దేశాల్లోనూ ఈ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఐరోపా దేశాల్లో ఎఐ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదని, త్వరలో అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఓపెన్‌ఎఐ వెల్లడించింది.
ఈ ఎఐ ఏజెంట్ సంక్లిష్టమైన ఆన్‌లైన్ పనులను స్వతంత్రంగా నిర్వహించగలదు. ఇది ‘కంప్యూటర్-యూజింగ్ ఏజెంట్’ ఆధారంగా పని చేస్తుంది. జీపీటీ-4o, o3మోడళ్ల ఆధునిక నైపుణ్యాలతో రూపొందించిన ఈ ఎఐ, ప్రత్యేక బ్రౌజర్‌లో పని చేస్తుంది. యూజర్లు ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఇది స్వతంత్రంగా పని చేయగలదు. టెక్ట్స్, ఇమేజ్ తరహా ఇన్‌పుట్‌లను స్వీకరించి, లోపాలను సరిదిద్దడం, అనుకోని సవాళ్లను ఎదుర్కోవడం, ఉత్పాదకతను పెంచడం లాంటి పనులను ఈ ఎఐ సమర్ధవంతంగా నిర్వహించగలదు.
ఓపెన్‌ఎఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఈ ఎఐ ఏజెంట్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సాయంగా మారగలవని, వారికి కేటాయించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలవని తెలిపారు. అయితే స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం వీటికి లేదని, మానవుల ప్రమేయం అవసరమేనని స్పష్టం చేశారు. దీర్ఘకాలంలో విజ్ఞానానికి సంబంధించిన అన్ని రంగాల్లో ఎఐ ఏజెంట్లు ప్రాముఖ్యత పొందుతాయని అభిప్రాయపడ్డారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఎఐ వినియోగం అనివార్యంగా మారింది. దీంతో ఎఐతో ఉద్యోగాలు ప్రమాదంలోపడడం ఖాయమనే చర్చ గత కొన్ని రోజులుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎఐ ఏజెంట్స్ అనే పేరు బాగా వినిపిస్తోంది. ఏళ్ల అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చేసే పనులను ఎఐ ఏజెంట్స్ చేయగలవని ఆల్టామాన్ చెప్పిన మాటలు ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
ఈ ఎఐ ఏజెంట్స్ భవిష్యత్తుల్లో ఒక సాధారణ ఉద్యోగిలాగా పనిచేస్తాయని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ తెలిపారు. ఈ ఏజెంట్లు ఈ సంవత్సరం వర్క్‌ఫోర్స్‌లో చేరతారని, వీటితో కంపెనీల ఉత్పత్తి భారీగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏఐ ఏజెంట్స్ కోడింగ్‌ను కూడా సమర్థవంతంగా చేయగలవని వెల్లడించారు.
అయితే, ఈ ఎఐ ఏజెంట్స్ మనుషులను పూర్తిగా భర్తీ చేస్తాయా అంటే లేదని ఆల్ట్‌మాన్ తెలిపారు. ఈ ఏజెంట్లు మనుషులు చేసే పనులు చేసినప్పటికీ నాణ్యత, ఆవిష్కరణలకు సంబంధించి పర్యవేక్షించేందుకు మానవులు అవసరమవుతారని పేర్కొన్నారు. అయితే ఇవి మనుషులతో కలిసి పనిచేస్తాయని తెలిపారు. కానీ వీటి ప్రభావం కచ్చితంగా ఉద్యోగాలపై పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే చాలా కంపెనీలు ఎఐ ఏజెంట్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. గూగుల్, మెటా వంటి పెద్ద కంపెనీలు తమ వర్క్ ఫోర్స్‌లో వీటిని ఉపయోగించుకుంటున్నాయి. గూగుల్ తన కోడ్ నిర్మాణంలో ఎక్కువ భాగాన్ని ఎఐతోనే రూపొందిస్తుంది. అదే విధంగా మెటా కూడా ఎఐ ఏజెంట్స్‌తో కలిసి పనిచేస్తుంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఎఐ మిడ్-లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను భర్తీ చేస్తుందని తెలిపారు.
More Stories
కోల్‌కతాలో భారీ వర్షం… విద్యుత్ షాక్ లకు 9 మంది మృతి
మల్లోజుల వేణుగోపాల్ ద్రోహి.. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం