
తమ ఆయుధాలు అమ్ముకోవడం కోసం కొన్ని దేశాల మధ్య చిచ్చు రాసేయడం కూడా ఆ దేశానికి అలవాటే అన్న ఆరోపణలు చాలాకాలంగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా గత జో బైడెన్ హయాంలో చేసిన చీకటి పనులన్నీ బహిర్గతం చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. అలా బయటపడ్డదే భారత్‌లో మోదీ సర్కారును కూల్చేందుకు బైడెన్ సర్కారు పన్నిన కుట్ర.
భారత్ లో నరేంద్ర మోదీ సారధ్యంలోని బిజెపి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారని తేటతెల్లమవుతుంది. భారత్‌లోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, పత్రికలు, మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలకు నిధులు అందజేసి వ్యతిరేక కథనాలు వండి వార్చింది. ఈ మొత్తం క్రతువులో కీలక పాత్ర పోషించింది ఓ తెలుగు మహిళ కావడం గమనార్హం. యుఎస్ ఎయిడ్ ఇండియా చీఫ్‌గా పనిచేసిన ఆ మహిళ పేరు వీణా రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన వీణా రెడ్డి అమెరికా దౌత్యవేత్తగా ఎదిగారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి డిగ్రీ, పీజీ చేసిన ఆమె కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టరేట్ కూడా పొందారు. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ కౌన్సిల్ సభ్యురాలిగా కూడా ఉన్నారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వంలో చేరడానికి ముందు, వీణా రెడ్డి న్యూయార్క్, లండన్, లాస్ ఏంజిల్స్‌లలో కార్పొరేట్ అటార్నీగా పనిచేశారు.
ఆమె ప్రస్తుతం యుఎస్ ఎయిడ్ కంబోడియా మిషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. గతంలో భారతదేశం, పాకిస్తాన్, హైతీ, ఆఫ్ఘనిస్తాన్‌లలో పదవులు నిర్వహించారు. ఆమె 2021 నుండి 2024 వరకు యుఎస్ ఎయిర్ ఇండియా, భూటాన్‌లకు మిషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. అమెరికా సీనియర్ ఫారిన్ సర్వీస్‌లో కెరీర్ సభ్యురాలిగా, ఈ దేశాలలో అమెరికన్ ఏజెన్సీ కార్యకలాపాలకు నాయకత్వం వహించిన మొదటి భారతీయ-అమెరికన్ కూడా ఆమె.
ఆమె భారతదేశంలో ఉన్న సమయంలో, యుఎస్ ఎయిడ్ ప్రాజెక్టులకు నిధులు 2021లో $94.3 మిలియన్ల నుండి 2022లో $228 మిలియన్లకు పెరిగాయి. ఇది 2023లో $175.7 మిలియన్లకు పడిపోయింది, ప్రభుత్వ డేటా ప్రకారం 2024లో $151.8 మిలియన్లకు తగ్గింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన ఒక నెల తర్వాత, జూలై 17, 2024న ఆమె అమెరికాకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు.
ఇలా ఉండగా, వీణా రెడ్డి భారత్ లో యుఎస్ ఎయిడ్ మిషన్ బాధ్యతలు చేపట్టిన సమయంలో శుభాకాంక్షలు వ్యక్తం చేస్తూ నాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అంటే, ఆమెకు రాజకీయ సంబంధాలు ఉన్నట్లు వెల్లడవుతుంది.
అధికారిక కార్యక్రమాల మాటున చాటుగా యుఎస్ ఎయిడ్ నిధులను భారత్ లో ఓట్ల శాతం పెంచడం కోసం 21 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారన్నది ప్రస్తుత అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణ. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ మహేశ్ జెఠ్మలానీ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత ఈ నిధులపై భారత ప్రభుత్వ ఏజెన్సీలు దర్యాప్తు జరిపే అవకాశం ఉన్నందునే ఆమె అమెరికాకు తిరిగి వెళ్లిపోయారని జెఠ్మలానీ ఆరోపిస్తున్నారు. తద్వారా ఇదంతా వీణా రెడ్డికి తెలిసే జరిగిందా? లేక ఆమె కూడా ఇందులో ఒక పావుగా? మారారా? అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
More Stories
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి