ముగ్గురు ఐపీఎస్ లు ఏపీలో రిపోర్ట్ చేయాలి

ముగ్గురు ఐపీఎస్ లు ఏపీలో రిపోర్ట్ చేయాలి
తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. మాజీ డిజిపి అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతీలను రిలీవ్ చేయాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ముగ్గురు అధికారులను వెంటనే ఆంధ్రాకు రిపోర్టు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. అంతేగాక, 24 గంటల్లోనే ఏపీలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం డీజీ హోదాలో కొనసాగుతున్న అంజనీకుమార్ రోడ్డు భద్రత డీజీగా ఉన్నారు.
డీజీ హోదాలో ఉన్న మరో ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్తా పోలీస్ ట్రైనింగ్ డీజీగా ఉన్నారు. ఎస్పీ హోదాలో కొనసాగుతున్న అభిషేక్ మహంతి ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కాగా, రాష్ట్ర విభజన సమయంలో ఈ అధికారులను ఏపీకి కేటాయించారు. అయితే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఐపీఎస్ అధికారులు తెలంగాణలో కొనసాగుతున్నారు.
అయితే అంజనీకుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిలను తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశించిన కేంద్ర హోంశాఖ వెంటనే ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  ఇంతకుముందే తెలంగాణలో పనిచేసిన ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారులు సోమేశ్‌కుమార్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రోనాల్డ్‌ రోస్, ఆమ్రపా­లిలను ఏపీ కేడర్‌కు పంపిన విషయం తెలిసిందే