
పాక్‌లో రెండ్రోజుల అధికార పర్యటనలో భాగంగా ఎర్డెగోన్ కశ్మీర్ అంశంపై మాట్లాడారు. కశ్మీర్ సమస్యను ఇండియా, పాకిస్థాన్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా ఉభయదేశాలు చర్చించుకోవాలని హితవు చెప్పారు. కశ్మీర్ సోదరులకు తాము సంఘీభావం తెలుపుతున్నట్టు ఆయన ప్రకటించారు.
కాగా, కేంద్ర పాలత ప్రాంతాలైన జమ్ము, కశ్మీర్, లద్దాఖ్‌లు భారతదేశంలో అంతర్భాగమని భారత్ పదేపదే స్పష్టం చేస్తోది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను 2019 ఆగస్టు 5న రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. తిరిగి రాష్ట్ర హోదా కల్పించే దిశగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు సైతం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
More Stories
రేపు మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం