
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు రానుందని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. మెదక్, పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే అన్ని స్థానాలకు స్పష్టం చేశారు. కాంగ్రెస్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో బిజెపి ఎమ్యెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని, అందుకే తెర వెనుక నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు.
రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాల నుండి ఎన్నికలు జరుగుతుంటే కేవలం బిజెపి మాత్రమే మూడు స్థానాలకు పోటీచేస్తుండగా, కాంగ్రెస్ ఒక గ్రాడ్యుయేట్ స్థానం నుండి మాత్రమే పోటీ చేస్తున్నది. బిఆర్ఎస్ ఒక స్థానంలో కూడా పోటీ చేయడం లేదు. రాష్ట్రంలో మార్పు తెస్తామని చెప్పి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని కానీ ఆచరణలో ఎందుకు చూపడం లేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, ప్రకటనలు ఫస్ట్ పేజీల్లో ఉన్నాయని, పనులు మాత్రం ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మంత్రుల్లో సఖ్యత లేదని చెప్పారు. తెలంగాణ భవిష్యత్‌కు ఎమ్మెల్సీ ఎన్నికలు దిశానిర్దేశం చేసేవని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపించారు.
రేవంత్ ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మిగిలిన యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రేవంత్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ఆయన మండిపడ్డారు. ప్రతి దళిత కుటుంబానికి రూ 12లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని ధ్వజమెత్తారు.తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐదు డీఏలపై రేవంత్ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పోయి రేవంత్ వచ్చిన కూడా ప్రజల బతుకులు మారడం లేదని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబమంతా దోచుకుందని కేంద్రమంత్రి ఆరోపించారు. కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చేసుకున్నారని విమర్శించారు.
రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతికి పెద్దపీట వేశారని ఆరోపించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో మంచి పాలన జరుగుతుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో మంచి పాలన రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అన్ని వర్గాల సమస్యలపై ఉద్యమిస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు