2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్

2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్

2047 నాటికి భారతదేశం 23 ట్రిలియన్ డాలర్ల నుండి 35 ట్రిలియన్ డాలర్ల జిడిపితో అధిక ఆదాయ దేశంగా మారనుందని, దీనికి సేవల రంగం ప్రోత్సాహం ఇస్తుందని ఒక నివేదిక తెలిపింది. 2047 నాటికి, సేవల రంగం భారతదేశ జిడిపిలో 60 శాతం ఉంటుందని అంచనా వేయగా, తయారీ రంగం 32 శాతం వాటాను కలిగి ఉంటుందని పేర్కొన్నది. 

ఈ రెండు రంగాలు  ఆర్థిక వృద్ధికి కీలకమైన చోదకాలుగా మారుతాయని బెయిన్ & కంపెనీ, నాస్కామ్ నివేదిక పేర్కొంది. “రాబోయే దశాబ్దాలలో దాదాపు 200 మిలియన్ల మంది వ్యక్తులు శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తారని అంచనా వేస్తుండడంతో వేభారతదేశం అధిక-విలువైన ఉద్యోగ సృష్టిని నడిపించడానికి, గణనీయమైన ఆర్థిక సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కలిగి ఉంది” అని నివేదిక  పేర్కొంది. 

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చిప్‌ డిజైన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌లో పూర్తి స్థాయి యాంత్రీకరణ, విడిభాగాల తయారీ, డిజైన్‌తో తిరోగమన అనుసంధానం ద్వారా ధరలో పోటీ సామర్థ్యం, ఆవిష్కరణల సామర్థ్యాన్ని పెంచనుంది. దాంతో ఆ రంగ ఎగుమతి వాటా 24 శాతం నుంచి 2047 నాటికి 45-50శాతానికి పెంచుకునే వీలుంటుంది. అలాగే, జీడీపీలో ఈ రంగం వాటా 3 శాతం నుంచి 8-10 శాతానికి చేరుకోవచ్చు.

భారత ఆర్థిక వ్యవస్థకు కొన్ని సవాళ్లున్నాయి. 2030 నాటికి నిపుణుల కొరత 5 కోట్లకు పెరగవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌ (ఎ్‌సటీఈఎం) విద్యను మరింత మెరుగుపరచడంతో పాటు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. స్థానికంగా తయారీ సహా కీలక విడిభాగాల ఉత్పత్తి, డిజైనింగ్‌కు మరింత ప్రాధాన్యమివ్వాలి. తద్వారా విడిభాగాల కోసం దిగుమతులపై ఆధారం తగ్గుతుంది.

ఏఐలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం, హరిత ఇంధనం, ఇతర కీలక రంగాలు, ఆర్‌ అండ్‌ డీలో పెట్టుబడుల పెంపు దేశీయంగా ఆవిష్కరణలకు దోహదపడటంతో పాటు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై ఆధారపడటాన్ని తగ్గించుకోగలుగుతాం. మౌలిక వసతుల పెంపు, నైపుణ్య కొరతను తగ్గించుకోవడంతోపాటు అంతర్జాతీయ భాగస్వామ్యాలు, సాంకేతికత ద్వారా ఆవిష్కరణలను వేగవంతం చేయడంపైనే భారత ఆర్థిక వృద్ధి ఆధారపడి ఉంది.

డిజిటల్‌, రవాణ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, దేశీయంగా తయారీ పెంపు, భాగస్వామ్యాల ద్వారా పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా భవిష్యత్‌ టెక్నాలజీలు, ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టవచ్చని నాస్కామ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంగీత గుప్తా అన్నారు. బహుముఖ, సాంకేతిక విధానం ద్వారా సమ్మిళిత, సుస్థిర వృద్ధికి బాటలు వేయవచ్చన్నారు